DCGI కోవిషీల్డ్, కోవాక్సిన్ మిక్సింగ్.. డీజీసీఐ గ్రీన్ సిగ్నల్!

దేశంలో వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) మంగళవారం భారతదేశంలో కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను మిక్సింగ్ చేయడానికి సంబంధించిన అధ్యయనానికి ఆమోదం తెలిపింది.

Covax

Mixing of Covishield, Covaxin; దేశంలో వ్యాక్సిన్ డ్రైవ్‌ను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) మంగళవారం భారతదేశంలో కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను మిక్సింగ్ చేయడానికి సంబంధించిన అధ్యయనానికి ఆమోదం తెలిపింది. అధ్యయనానికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు DCGI తెలిపింది.

ఇండియా టుడే నివేదిక ప్రకారం, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ జూలై 29 న ఈ అధ్యయనాన్ని నిర్వహించాలని సిఫార్సు చేసింది. కోవిడ్-19 వ్యాక్సిన్‌లు కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్‌ల మిక్సింగ్ కోసం 300 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లను ఎంచుకోగా.. ఫేజ్ -4 క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి వెల్లూర్ సిఎంసికి అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.

నివేదిక ప్రకారం, వ్యాక్సిన్ కోర్సును పూర్తి చేయడానికి ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్ షాట్‌లను ఇవ్వవచ్చో లేదో అంచనా వేయడం అధ్యయనం ప్రధాన లక్ష్యం. ఉత్తరప్రదేశ్‌లో పొరపాటున కొవిషీల్డ్‌, కొవాక్సిన్ వ్యాక్సిన్ డోసుల మిశ్రమాన్ని పొందిన వారిపై ఇటీవల భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనం జరిపింది.

ఈ అధ్యయనంలో మిక్సింగ్ డోసుల వల్ల కరోనా నుంచి మరింత మెరుగైన రక్షణ లభిస్తుందని వెల్లడైంది. కొవాక్సిన్ ఇన్‌యాక్టివేటెడ్‌ హోల్‌ వైరియాన్‌ వ్యాక్సిన్ కాగా.. కొవిషీల్డ్‌ను మాత్రం అడినోవైరస్‌గా ఉపయోగిస్తూ రూపొందించారు.