Ddca Sends Letter To Delhi Government Offering Arun Jaitley Stadium As Covid 19 Vaccination Centre
Arun Jaitley Stadium: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అరుణ్ జైట్లీ స్టేడియాన్ని కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ గా వాడుకోవచ్చంటూ సూచించింది. ఈ విషయాన్ని రాష్ట్ర క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ కన్ఫామ్ చేశారు. ఈ మేరకు రోహన్ జైట్లీ ఢిల్లీ గవర్నమెంట్ కు దాదాపు 10వేల మందికి ప్రతి రోజూ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు సరిపోతుందని వివరించింది.
నాకు తెలిసి క్రికెట్ స్టేడియం వ్యాక్సినేషన్ సెంటర్ గా సరిపోతుందని భావిస్తున్నాం అని జైట్లీ శనివారం అన్నారు. 45ఏళ్లు అంతకంటే ఎక్కువ ఉన్న హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ స్టాఫ్ 470సెంటర్లలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు. 18 నుంచి 44ఏళ్ల మధ్య వయస్సున్న వాళ్లు 394సెంటర్లలో వ్యాక్సినేషన్ లో పాల్గొంటున్నారు.
మొత్తం అన్ని క్యాటగిరీలో వారీగా బుధవారం ఉదయం నాటికి జనవరి 16న మొదలైన వ్యాక్సినేషన్ డ్రైవ్ 41.64లక్షల డోసులు పూర్తి చేసుకోనుంది. 18 నుంచి 44ఏళ్ల మధ్య వయస్సున్న వారికి 8.17లక్షల డోసులు ఇవ్వనుంది ఢిల్లీ. 45ఏళ్లు దాటిన వారికి 43లక్షల డోసులు ఇవ్వనుంది.
మా స్టేడియం చుట్టూ పరిసరాల్లో రోజుకు 10వేల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వొచ్చు. వారికి అవసరమైనన్ని రోజులు వాడుకోవచ్చు కూడా. క్రికెటింగ్ యాక్టివిటీ మొదలయ్యే వరకూ అందుబాటులో ఉంటుంది. అని అధికారులు చెప్పారు.