Rajya Sabha : చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు Defence Minister రాజ్ నాథ్ సింగ్. చైనా బోర్డర్ పై నెలకొన్న వివాదంపై ఆయన రాజ్యసభలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగాన్ని రాజ్ నాథ్ స్మరించుకున్నారు.
గాల్వాన్ లో చైనా బలగాలకు గట్టిగా సమాధానం చెప్పడం జరిగందని సభలో వెల్లడించారు. చైనాకు ఇప్పటికే గట్టిగా సమాధానం చెప్పడం జరిగిందన్నారు. 1963 నుంచి లద్దాఖ్ లో 38 వేల చదరపు కిలోమీటర్ల భూ భాగాన్ని చైనా ఆక్రమించుకుందని స్పష్టం చేశారు.
https://10tv.in/corona-china-vaccine-by-november/
శాంతియుతం వాతావరణం కోసం ఎన్నో ఒప్పందాలు చేసుకున్నామని, దైపాక్షిక బంధమే సమస్యకు పరిష్కారమని నొక్కి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ లోని వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తనదని చైనా వాదిస్తోందని చెప్పారు.
సరిహద్దులో తక్కువ సంఖ్యలో సైన్యం ఉండాలని LIC ఒప్పందం చెబుతుందన్నారు. చైనా మాత్రం సరిహద్దుల్లో భారత్‌ను కవ్విస్తుందన్న రాజ్‌నాథ్‌సింగ్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఏప్రిల్ నుండి పాంగోంగ్ సరస్సు మరియు లడఖ్‌లోని అనేక ప్రాంతాలలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు పదేపదే అతిక్రమించిన నేపథ్యంలో ఒక ప్రకటన ఇవ్వాలని పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చింది. జూన్ 15వ తేదీన 20 మంది భారతీయ సైనికులను చైనా లిబరేషన్ ఆర్మీ పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే.