Rajnath Singh’s Statement : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో రాజ్ నాథ్ సింగ్ ప్రకటన

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. నిన్న ఉదయం 11.48 గంటలకు సూలూరు నుంచి హెలికాప్టర్ బయల్దేరిందన్నారు.

Rajnath Singh’s statement on Army helicopter crash : తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్‌ వద్ద భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్‌ కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. నిన్న ఉదయం 11.48 గంటలకు సూలూరు నుంచి హెలికాప్టర్ బయల్దేరిందన్నారు. మధ్యాహ్నం 12.08 నిమిషాలకు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని పేర్కొన్నారు.

ల్యాండింగ్ కు 7 నిమిషాల మందు ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. హెలికాప్టర్ కూలిపోవడాన్ని స్థానికులు గమనించారని చెప్పారు. స్థానికులు వెళ్లే సరికి హెలికాప్టర్ మంటల్లో కాలిపోయిందని తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది చనిపోయారని వెల్లడించారు. ప్రమాద ఘటనపై ఐఏఎఫ్ విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎయిర్ మార్షల్ నేతృత్వంలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. విచారణ బృందం నిన్ననే దర్యాప్తు ప్రారంభించిందన్నారు.

cheddi gang In AP :బెజవాడను బేజారెత్తిస్తున్న చెడ్డీ గ్యాంగ్..పోలీసులకు సవాల్ గా వరుస దోపిడీలు

హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో సీడీఎస్ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక రావత్ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎయిర్ ఫోర్స్ ఫైలెట్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేమని తెలిపారు.

కాగా హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు ప్రకటించింది. ఘటనాస్థలికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకొని వెల్లింగ్టన్ బేస్ క్యాంపుకు తరలించారు. బ్లాక్ బాక్స్ కనుగొనేందుకు వింగ్ కమాండర్ ఆర్ భరద్వార్ నేతృత్వంలోని 25 మంది సభ్యుల వైమానిక బృందం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ రోజు బ్లాక్‌బాక్స్ ఢిల్లీ తరలించి అందులోని డేటాను డీకోడ్ చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు