కొవిషీల్డ్ డోసులు సరఫరా ఆలస్యం, ధర విషయంలో కేంద్రంతో సీరంకు కుదరని డీల్ ?

delay in supply of covishield doses : భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థల్లో ఒక్కటైన సీరం ఇనిస్టిట్యూట్ తాము తయారు చేసిన టీకాను అందించేందుకు ఆలస్యం చేస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. ధరల విషయంలో కేంద్రంతో ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. దీంతో వ్యాక్సిన్ పంపిణీ లేట్ అవుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి 2021, జనవరి 07వ తేదీ గురువారం భారీ ఎత్తున్న పూణె నుంచి కొవాగ్జిన్ డోసులు బయలుదేరాల్సి ఉంది.

దేశ వ్యాప్తంగా…అత్యవసర వినియోగం కోసం పూణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ కొవిషీల్డ్ ఐదు కోట్ల డోసులను సిద్ధం చేసింది. వీటి యొక్కో డోస్ రూ. 200 చొప్పున విక్రయించేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. బహిరంగమార్కెట్ లో వేయి రూపాయల వరకు విక్రయిస్తామని సీరం ప్రకటించింది. అయితే ప్రజాప్రయోజనాల దృష్ట్యా మరింత తక్కువ ధరకు వ్యాక్సిన్ సరఫరా చేయాలని కేంద్రం కోరుతున్నట్లుగా సమాచారం.

ధర విషయంలో సరఫరా జరగడం లేదనే వార్తలను సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో పూనావాలా తోసిపుచ్చారు. గురువారం సరఫరా చేయాల్సిన డోసులను సీరం ఇప్పటికీ రవాణా చేయకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. వ్యాక్సిన్ రవాణాను గురువారం సరఫరా చేస్తామని ముందు తెలియచేశాయి. కానీ..అలాంటి జరగలేదు. శుక్రవారానికి మార్చడం జరిగిందని, మరో 48 గంటల్లో వ్యాక్సిన్ సరఫరా చేసే అవకాశం ఉందని సీరం వెల్లడిస్తుండడంతో వ్యాక్సిన్ సరఫరా సోమవారానికి వాయిదా పడ్డాయని తెలుస్తోంది. భారీ ఎత్తున్న సరఫరా అయ్యే వ్యాక్సిన్ డోస్ ల కోసం పూణె ఎయిర్ పోర్టు సిద్ధంగా ఉందని, రోజుకు 150 టన్నుల కార్గో రవాణాకు ఎయిర్ పోర్టు అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

ట్రెండింగ్ వార్తలు