Delhi : కుక్క మొరుగుతోందని ఐరన్‌ రాడ్‌ తో దాడి..ముగ్గురికి గాయాలు

ఓ వ్యక్తి మాత్రం తనను చూసి పదే పదే మొరుగుతున్న ఓ ఇంటి పెంపుడు కుక్కపై ఐరన్ రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. అడ్డం వచ్చినవారిపై కూడా దాడి చేయగా ముగ్గురికి గాయాలయ్యాయి.

Dog barked and was attacked with an iron rod : కొత్త వ్యక్తులు ఇంటి వైపు వస్తున్నపుడు ఆ ఇంటి పెంపుడు కుక్కలు అరవడం సర్వసాధారణం. ఆ అరుపులకు కొంతమంది భయపడతారు. మరికొంతమంది అదేం చేస్తుందిలే అనుకుని లైట్ తీసుకుని తమ దారిన తాము పోతుంటారు.కానీ ఢిల్లీలో ఓ వ్యక్తి మాత్రం తనను చూసి పదే పదే మొరుగుతున్న ఓ ఇంటి పెంపుడు కుక్కను చూసి ఊరుకోలేదు. ఏకంగా ఐరన్ రాడ్డుతో ఆ కుక్కమీద దాడికి పాల్పడ్డాడు. ఐరన్ రాడ్డుతో కొట్టటంతో పాపం ఆ కుక్క దెబ్బలు తాళలేకపోయింది.

కుక్కను కొడతుంటే ఆ కుక్క యజమానులు అడ్డం వెళ్లారు. కుక్క మొరుగుతుందే గానీ కరవదు..దానిని విడిచి పెట్టండీ అంటూ బతిమిలాడారు. అయినా సదరు వ్యక్తి ఆగలేదు. కాని కుక్క పదే పదే మొరుగుతోంది అంటూ కుక్క యజమానులతో గొడవపడ్డాడు. ప్రతీరోజులాగే గొడవకొచ్చాడు. దీంతో మాటా మాటా పెరిగింది. అంతే అక్కడే ఉన్న ఓ ఐరన్ రాడ్ తో దాడికి దిగాడు. యజమానులు అడ్డం పడ్డా ఆగలేదు. వారిని తోసి వేసి..కుక్కపై దాడికి చేశాడు. పదే పదే కొట్టటంతో పాపం ఆ మూగ జీవి రక్తపు మడుగులో కొట్టుకులాడింది.

ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతం నుండి కొన్ని షాకింగ్ ఫోటోలు బయటకు వచ్చాయి. కుక్కను కొడుతుంటే అడ్డం వచ్చిన స్థానికులపై కూడా రాడ్‌తో దాడి చేసి విచక్షణారహితంగా వీరంగం ఆడాడు. అడ్డుపడ్డవారందరినీ విచక్షణారహితంగా చితకబాదేశాడు. అడ్డం వచ్చినవారిని కొట్టాడు. అలాగే కుక్కను కూడా దారుణంగా కొట్టాడు.ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సదరు వ్యక్తి దాడిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలైయ్యాయి. ఇదంతా అక్కడే అమర్చి ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ఘటన తర్వాత కుక్క యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై పశ్చిమ విహార్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు