Delhi : పెంపుడు కుక్కతో వాకింగ్ కు వస్తున్న ఐఏఎస్ అధికారి..క్రీడాకారులను అడ్డుకుంటున్న స్టేడియం సిబ్బంది..

పెంపుడు కుక్కతో ఐఏఎస్ అధికారి వాకింగ్ కు వస్తున్నారని ఆ సమయంలో స్టేడియంకు క్రీడాకారులు ఎవ్వరూ రాకుండా అడ్డుకుంటున్నారు స్టేడియం సిబ్బంది..ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి వెళ్లటంతో..

Delhi

Delhi : ఓ ఐఏఎస్ అధికారి తన పెంపుడు కుక్కతో వాకింగ్ కు వస్తున్నారని స్టేడియం సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఐఏఎస్ అధికారి ఈవెనింగ్ వాకింగ్ కు వస్తున్న ఆ సమయంలో స్టేడియంలో క్రీడాకారులు ఎవ్వరూ లేకుండా చేస్తున్నారు స్టేడియం సిబ్బంది. దీంతో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలా మధ్యలోనే తమను పంపించేయటం లేదా అస్సలు స్టేడియంకు రానివ్వకపోవటం చేయటం వల్ల ప్రాక్టీస్ చేసుకోవటానికి ఇబ్బందిగా మారుతోందని అని వాపోతున్నారు క్రీడాకారులు.

ఢిల్లీలో ఒక ఐఏఎస్‌ అధికారి తన కుక్కతో ఈవినింగ్‌ వాక్‌ చేసేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలోని త్యాగరాజ్ స్టేడియానికి వ‌స్తున్నారు. దీంతో ఆ స‌మ‌యంలో స్టేడియంలోకి క్రీడాకారుల‌ను రానివ్వ‌కుండా సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో క్రీడాకారుల కోసం స్టేడియం వేళలను పొడిగించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలోని త్యాగరాజ్ స్టేడియంలో పలువురు క్రీడాకారులు శిక్షణ పొందటంతోపాటు ప్రాక్టీస్‌ చేస్తుంటారు.
దాదాపు అదే సమయానికి ఢిల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజీవ్ ఖిర్వార్ సాయంత్రం ఆ స్టేడియానికి వచ్చి తన కుక్కతో కొంతసేపు వాకింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో స్టేడియం సిబ్బంది క్రీడాకారులను ముందుగానే అక్కడి నుంచి పంపివేస్తున్నారు. దీంతో క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంపై మీడియాలో వార్తలు రావడంతో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. క్రీడాకారులకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టేడియం వేళలను రాత్రి పది గంటల వరకు పొడిగించారు. ఢిల్లీ ఉప ముఖ్యమత్రి మనీష్ సిసోడియా ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని గురువారం (మే 26,2022)వెల్లడించారు.