All party meeting: ఢిల్లీలోని పార్లమెంటు లైబ్రరీ బిల్డింగ్‌లో అఖిలపక్ష సమావేశం

ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర సర్కారు పలు అంశాలను విపక్షాలకు వివరించింది.

All party meeting

All party meeting – Parliament: ఢిల్లీ(Delhi )లోని పార్లమెంటు లైబ్రరీ బిల్డింగ్‌లో ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు (5 రోజుల పాటు) పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర సర్కారు పలు అంశాలను విపక్షాలకు వివరించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రభుత్వం నుంచి హాజరయ్యారు.

కాగా, ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్లు, ఇండియా పేరును పూర్తిగా భారత్ గా మార్పు వంటి పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ దేశంలో అతి పెద్ద సంస్కరణలకు ఎన్డీఏ సర్కారు సిద్ధమైనట్లు సమాచారం.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కోసమే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ బిల్లుపై అధ్యయనం జరిపింది.

Intrest on EPF: కోట్లాది ప్రైవేటు ఉద్యోగులకు చేదువార్త.. పీఎఫ్‌పై వడ్డీ తగ్గే అవకాశం

ట్రెండింగ్ వార్తలు