ఢిల్లీలో హీటెక్కిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

  • Publish Date - January 24, 2020 / 03:58 AM IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ   దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.  శుక్రవారం జనవరి 24న  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్తాఫాబాద్, కారావాల్ నగర్, గోకుల్‌పురి ప్రాంతాల్లో 3 బహిరంగ సభల్లో  ప్రసంగిస్తుండగా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా  ఈస్ట్ ఢిల్లీలోని లక్ష్మీనగర్, విశ్వాస్ నగర్ ఏరియాల్లో బహిరంగ సభల్లో పాల్గోంటున్నారు. 

కాగా …..ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీ అభ్యర్థుల తరఫున రోడ్‌షోలో పాల్గొని ప్రచారం చేయనున్నారు. ద్వారక అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి తరఫున ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసిడోయా బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఇందుకు భిన్నంగా ఇంటింటికితిరిగి  ప్రచారం చేస్తూ, బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు.

ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్‌పై బీజేపీ నుంచి యువమోర్చా అధ్యక్షుడు సునీల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8 పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడిస్తారు.