దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను 2020, జనవరి 06వ తేదీ సోమవారం ఎన్నికల అధికారులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీతో అసెంబ్లీ గడువు ముగియనుంది. సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఒకే దశల్లో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది.
* 2020, ఫిబ్రవరి 08న పోలింగ్.
* 2020,. ఫిబ్రవరి 11వ తేదీన కౌంటింగ్.
* 2020, జనవరి 14న నామినేషన్ల స్వీకరణ.
* 2020, జనవరి 21 నామినేషన్లకు తుది గడువు.
* 13 వేల 750 పోలింగ్ బూత్‌లు
* కోటి 46 లక్షల 92 వేల మంది ఓటర్లు.
* ఎన్నికల కోసం 90 వేల మంది సిబ్బంది.
* 2015 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది.
* 67 స్థానాల్లో AAP, 03 స్థానాల్లో BJP పార్టీలు విజయం సాధించాయి.