ఢిల్లీలో 6 గజాల్లో మూడంతస్తుల ఇల్లు…ఇక కనిపించదు

  • Publish Date - November 25, 2020 / 05:09 PM IST

Delhi :famous three storey house 6 yard demolished : దేశరాజధాని ఢిల్లీలోని బురాడీలో 6 గజాల స్థలంలో నిర్మించిన మూడు మూడంతస్తుల భవనం ఇక కనిపించదు. ఆ ముచ్చటైన ఇల్లుని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఈ ఇల్లు ఇక కనుమరుగుకుకానుంది.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బురాడీలోరి కేవలం ఆరంటే ఆరు గజాల్లో కట్టిన ఈ ఇల్లు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఇంటిని చూడటానికి ఎంతోమంది చాలా ఆసక్తిచూపిస్తుంటారు. అంత చిన్న స్థలంలో ఏకంగా మూడు అంతస్తుల ఇంటిని ఎలా కట్టారా అని..దూర ప్రాంతాల నుంచి జనం తరలివచ్చి మరీ చూసేవారు.
https://10tv.in/rajasthan-wedding-live-streaming-link-on-card-relatives-whatsapp-groups-wedding-dinner-door-deliverythis-is-corona-time-effect/


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆరు గజాల అతిచిన్న స్థలంలో ఇంటిని ఎలా కట్టారో చూడాలని చాలామంది తపనపడిపోతుంటారు. అయితే త్వరలో ఆ ఇల్లు కనుమరుగుకానుంది. కానీ అంత చిన్న స్థలంలో అంత పొడుగు ఇంటిని నిర్మించిన ప్లానర్‌ను అభినందించాల్సిందేననే వారు ఆ ఇంటిని చూసినవారంతా.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ ఆరు గజాల్లో కట్టిన ఈ మూడు అంతస్తులు ఇంట్లో బెడ్ రూమ్, కిచెన్, బాత్రూమ్, టెర్రస్, చిన్న మెట్లు అంతా వెరైటీయే..ఇంటిలో ఫ్లోరింగ్ పాలరాతితో నిర్మించారు. ఆ ఇంటిలో భార్యా భర్తా…ఇద్దరు పిల్లలు నివసిస్తున్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కాగా..భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘిస్తూ, నిర్మించిన ఈ ఇంటిని కూలగొట్టాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ ఇల్లు… చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు ప్రమాదకరంగా మారిందని అధికారులు భావించారు. ఈక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆ ఇంటిని కూల్చివేయాలని నిర్ణయించింది.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఓఇల్లు నిర్మించాలంటే కనీసం 32 చదరపు అడుగుల స్థలం అవసరముంటుందనీ..కానీ కేవలం ఆరు గజాల్లో మాత్రమే కట్టిన ఈ ఇంటి నిబంధనలకు అతీతమని ఎంసీడీకి చెందిన ఇంజినీరు ఒకరు తెలిపారు.ఇటువంటి ఇళ్లకు ఎప్పటికీ అనుమతి లభించదన్నారు. ఈ ఇంటి గురించి చాలామంది తమకు ఫిర్యాదు చేశారని, దీనిని త్వరలోనే కూల్చివేయనున్నామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు