‘Delhi Chalo’ protest : రైతన్నపై పోలీసులు వాటర్ కెనాన్‌లను ప్రయోగించారు పోలీసులు. రైతులు చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. భారీ సంఖ్యలో వస్తున్న రైతులను నిలువరించేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోలగిస్తూ..ముందుకు కదిలారు రైతులు. వీరిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. బారికేడ్లను బ్రిడ్జీలపై కిందకు పడేశారు. తమను ముందుకు పోనివ్వాలని కోరుతున్నారు. రైతులు చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి పోలీసులు అనుమతులు ఇవ్వలేదు.
ఢిల్లీ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. జాతీయ రహదారులను బారికేడ్లను ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్లకుండా రైతులను నిలువనిస్తున్నారు. కోవిడ్ పరిస్థితులు, 144 సెక్షన్ నిరసనలకు అనుమతి లేని కారణంగా..వారిని అడ్డుకుంటున్నారు. అనుమతి లేకుండా..కార్యక్రమాలు నిర్వహిస్తే..చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
https://10tv.in/high-tension-thousands-of-punjabi-farmers-on-the-border/
రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రం అవలింబిస్తోందని, దీనిని నిరసిస్తూ..పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. 2020. నవంబర్ 26వ తేదీ గురువారం ఉదయం భారీ ఎత్తున రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. 200 రైతు సంఘాలకు చెందిన వారు ఢిల్లీలో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.
జాతీయ రహదారుల గుండా..రైతులు ఢిల్లీకి బయలుదేరారు. మూడు వ్యవసాయ చట్టాలను ఏకపక్షంగా కేంద్రం ఆమోదించుకుందని, కనీసం మద్దతు ధర రావడం లేదని గత నెలన్నర రోజులుగా పంజాబ్ లో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 17వ తేదీన జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదు.
డిసెంబర్ 03వ తేదీన మరోసారి చర్చలు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. కానీ..దీనిని రైతులు తిరస్కరించారు. లక్షలాది మంది రైతులు బ్యాగులు, వంటసామాగ్రీ వెంట పట్టుకుని ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీకి రావొద్దని, ప్రస్తుతం కరోనా విస్తరిస్తోందని, చర్చల ద్వారా పరిష్కరించుకుందామని కేంద్రం చెబుతోంది.
రైతు చట్టాలను ఉపసంహరించుకోవాల్సి పోయింది..ఇలా చేయడం కరెక్టు కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్ వెల్లడించారు. వాటర్ కెనాన్, టియర్ గ్యాస్ ప్రయోగించడం సరికాదని, వ్యతిరేక చట్టాలు కావడంతోనే రైతులు ఆందోళన చేపడుతున్నారని పరిష్కరించాలని సూచించారు.
డ్రోన్స్ ద్వారా రైతుల ర్యాలీని పర్యవేక్షిస్తున్నారు.
నిరసన నేపథ్యంలో పోలీసు భద్రత కట్టుదిట్టం.
తనిఖీలు చేశాకే వాహనాలు ఢిల్లీలోకి అనుమతి.
ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్.
ఢిల్లీలో మెట్రో సేవలు నిలిపివేత. వాహనాలపైనా ఆంక్షలు.