Delhi liquor scam: 9 గంటల పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన సీబీఐ

Delhi liquor scam: ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణలో నిందితుల నుంచి సీబీఐ అనేక విషయాలు రాబట్టింది. వాటి ఆధారంగా కేజ్రీవాల్ ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

Arvind Kejriwal

Delhi liquor scam: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను లిక్కర్ స్కాం (Delhi liquor scam)లో సీబీఐ అధికారులు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కారులో కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) తన నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ నుంచి సీబీఐ (CBI) పలు వివరాలు రాబట్టడానికి ప్రయత్నించింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణలో నిందితుల నుంచి సీబీఐ అనేక విషయాలు రాబట్టింది.

వాటి ఆధారంగా కేజ్రీవాల్ ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ అధికారులు ఇప్పటికే పలువురు ప్రముఖులను అరెస్టు చేశారు. ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇదే కేసులో జైలులో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఇటీవల ఈడీ ప్రశ్నించింది.

కేజ్రీవాల్ ను ఇవాళ అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఆయనను అధికారులు అరెస్టు చేయలేదు. కేజ్రీవాల్ ను సీబీఐ ప్రశ్నిస్తోన్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి చర్చించింది. పరిస్థితులు ప్రతికూలంగా మారితే తదుపరి ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఆప్ నేతలు చర్చలు జరిపారు.

అసలు లిక్కర్ స్కాం జరగలేదని, కుట్రపూరితంగానే తమపై కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆప్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే సీబీఐ, ఈడీని కేంద్ర సర్కారు వాడుకుంటూ రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటోందని చెబుతున్నారు.

Alabama shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురి మృతి.. పలువురు టీనేజర్లకు గాయాలు

ట్రెండింగ్ వార్తలు