Delhi CM Kejriwal : ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ ఫోటోలు మాత్రమే ఉండాలని ఆదేశం

అంబేద్కర్‌ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. భగత్ సింగ్ విప్లవాత్మక స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. వారంతా దేశ ఉమ్మడి ప్రయోజనం కోసం వేర్వేరు మార్గాల్లో పనిచేశారని గుర్తు చేశారు.

Ambedkar and Bhagat Singh photos : ఢిల్లీ సీఎం కేజ్రివాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింట్లోనూ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ ఫొటోలు తప్ప మరే ఇతర రాజకీయ నేతల ఫోటోలు ఉండరాదని ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ముఖ్యమంత్రుల ఫొటోలూ అవసరంలేదన్నారు.

అంబేద్కర్‌ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. అలాగే, భగత్ సింగ్ విప్లవాత్మక స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. వారంతా దేశ ఉమ్మడి ప్రయోజనం కోసం వేర్వేరు మార్గాల్లో పనిచేశారని గుర్తు చేశారు. ఆ ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల సిద్ధాంతాలపైనే ఢిల్లీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కేజ్రివాల్.

TATA Air India : 70ఏళ్ల తర్వాత టాటాల చేతికి ఎయిర్‌ఇండియా

ప్రతి విద్యార్థికి మంచి విద్య అందాలని అంబేద్కర్‌ కలలు కన్నారు. కానీ 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ఇది సాకారం కాలేదని కేజ్రీవాల్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిఒక్కరికీ మంచి విద్య అందినప్పుడు మాత్రమే దేశం ముందుకెళ్తుంది తప్ప పెద్ద పెద్ద ఎన్నికల హామీలతో కాదన్నారు.

ప్రతి విద్యార్థికి మంచి విద్య అందినప్పుడే దేశం నంబర్‌ వన్‌గా మారుతుంది. దీనికి దగ్గరదారి ఏమీ లేదు. ఎన్నికల్లో ఎంత పెద్ద హామీ ఇచ్చామన్నది ముఖ్యం కాదని కేజ్రివాల్ అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే దిశగా కీలక చర్యలు తీసుకోవాలన్నారు. దేశభక్తిని పెంపొందించేందుకు దేశభక్తి తరగతులు బోధించనున్నట్టు కేజ్రీవాల్‌ వివరించారు.

ట్రెండింగ్ వార్తలు