కారులోనే దర్జాగా మందు కొట్టారు..ఆపై దంపతులను బెదిరించారు..వీడియో వైరల్

  • Publish Date - September 5, 2020 / 08:24 AM IST

కారులో దర్జాగా మద్యం సేవిస్తున్నారు. అంతేగాకుండా..కారులో వెళుతున్న దంపతులపై బెదిరింపులకు దిగారు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి..సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. బెదిరింపులకు దిగిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.




ఢిల్లీలోని పశ్చిమ విహార్ ప్రాంతంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బుధవారం రాత్రి ఇద్దరు యువకులు కారులో మద్యం సేవిస్తున్నారు. అదే ప్రాంతం గుండా దంపతులు కారులో వెళుతున్నారు. డ్రింక్ చేస్తాం..ఏ చేసుకుంటారో చేసుకోండి..అంటూ మద్యం ఉన్న గ్లాసును చూపించాడు ఓ యువకుడు.




కారును రివర్స్ చేసి వెళుతుండగా..కారులో ఉన్న యువకులు దిగి..దంపతులను బెదిరించే ప్రయత్నం చేశారు. ఎవరో వీడియోను తీసి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. వెంటనే పోలీసులు స్పందించారు. వీడియో పోస్టు చేసిన వ్యక్తిని గుర్తించి..ఫోన్ చేసి స్టేట్ మెంట్ రికార్డు చేశారు.




అనంతరం బెదిరింపులకు దిగిన వారిని పశ్చిమ విహార్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. కరణ్ చోప్రా, సత్ప్రీత్ సింగ్ లుగా గుర్తించారు.