Delhi Covid-Black Fungus : ఢిల్లీలో కరోనా, బ్లాక్ ఫంగస్ కల్లోలం..

దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్-19, బ్లాక్ ఫంగస్ కల్లోలం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు మొత్తం 1419986కు చేరుకున్నాయని హెల్త్ బులెటిన్ తెలిపింది.

Delhi Covid Black Fungus Reports 1568 Covid Cases 156 Deaths In Last 24 Hrs

Delhi Covid-Black Fungus Cases : దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్-19, బ్లాక్ ఫంగస్ కల్లోలం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు మొత్తం 1419986కు చేరుకున్నాయని హెల్త్ బులెటిన్ తెలిపింది. పాజిటివిటీ రేటు 2.52శాతం నుంచి 2.14 శాతానికి పడిపోయిందని పేర్కొంది. గత కొన్ని రోజులుగా, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పాజిటివిటి రేటులో గణనీయమైన తగ్గుదల ఉందని పేర్కొంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 1,550 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 21,739గా నమోదయ్యాయి.

మంగళవారం (మే 25) హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో 4,251 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 13,74,682కు చేరింది. కరోనా బారినపడి 156 మంది మరణించగా… మొత్తం మరణాల సంఖ్య 23,565కు చేరుకుంది. కరోనా వైరస్ రెండవ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ఢిల్లీలో మాత్రమేనని రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అన్నారు.

ఒక నెలలోనే కరోనా పరిస్థితి తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. కరోనా పాజిటివిటీ రేటు ఆల్-టైమ్ గరిష్టంగా 36శాతం నుంచి 2.5శాతానికి తగ్గిందని ఆయన తెలిపారు. COVID ఇన్ఫెక్షన్ల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నప్పటికీ.. బ్లాక్ ఫంగస్ కేసుల పెరుగుదల ఇప్పటికీ ఆందోళన కలిగిస్తోంది.. ఢిల్లీలో ఇప్పటివరకూ 500 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.

COVID-19 నుండి కోలుకున్న బాధితుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సుమారు 500 బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోమైకోసిస్ కేసులు నమోదయ్యాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఫంగస్ చికిత్సకు అవసరమైన ఆంఫోటెరిసిన్-B ఇంజెక్షన్ భారీ కొరత ఉందని సీఎం చెప్పారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ చికిత్సలో బాధితులకు రోజుకు నాలుగైదు ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో సుమారు 500 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి.

ఢిల్లీకి రోజుకు 400 నుంచి 500 ఇంజెక్షన్లు వస్తున్నాయని సీఎం చెప్పారు. లోక్ నాయక్ హాస్పిటల్, జిటిబి హాస్పిటల్, రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో బ్లాక్ ఫంగస్ చికిత్సకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ, తమ దగ్గర మందులు లేవని, ఇంకా ఇంజెక్షన్లు రాలేదని ఆయన చెప్పారు. ఈ ఇంజెక్షన్‌ను రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోందని తెలిపారు. అయితే మార్కెట్లో ఈ ఔషధం తీవ్రమైన కొరత ఉందని, ఉత్పత్తిని వేగవంతం చేయాలని సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు.