Delhi Election Results : ఢిల్లీ ఓటర్లకు సెల్యూట్‌.. అభివృద్ధి మా గ్యారంటీ: ఫలితాలపై మోదీ ట్వీట్‌!

Delhi Election Results : 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి వస్తోంది.

Delhi Election Results

Delhi Election Results : ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అఖండ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది చారిత్రాత్మకమైన విజయంగా ఆయన అభివర్ణించారు. ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి గెలిచింది. సుపరిపాలన గెలిచింది.

ఢిల్లీలో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని అందించినందుకు హస్తినా ప్రజలకు సెల్యూట్‌. మీరు అందించిన ప్రేమ, సహకారానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఢిల్లీ అభివృద్ధికి, ప్రజల జీవనాన్ని మెరుగుపర్చే దిశగా అన్ని చర్యలను తీసుకుంటాం. మా గ్యారంటీ.

భారత్ నిర్మాణంలో ఢిల్లీ కీలక పాత్ర పోషించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం’ అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఈ బీజేపీ విజయంతో పగలు, రాత్రి కస్టపడి శ్రమించిన పార్టీ కార్యకర్తలు, నేతలకు మోదీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి, రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా దేశ రాజధానిలో బీజేపీ తిరిగి అధికారంలోకి రానుంది. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి దశలోనే మోదీ పార్టీ భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఢిల్లీలోని 70 సీట్లలో 50 సీట్లలో ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఆప్ స్వల్పంగా పోటీ పడింది. కానీ, మధ్యాహ్నం 2.30 గంటల నాటికి, 85 శాతానికి పైగా ఓట్లు సాధించింది. కాషాయ పార్టీ 48 స్థానాల్లో, ఆప్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.