Delhi Liqour Case : ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. సీబీఐ కేసులో అప్రూవర్‌గా శరత్ చంద్రారెడ్డి!

సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా మారిన అనంతరం రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన వాగ్మూలం ఇచ్చారు.

Delhi Liqour Case : ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. అప్రూవర్‌గా మారిన అనంతరం రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన వాగ్మూలం ఇచ్చారు. సెక్షన్ 164 కింద శరత్ చంద్ర రెడ్డి వాగ్మూలం ఇచ్చారు. అయితే, శరత్ చంద్రా రెడ్డి స్టేట్మెంట్‌ని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా రికార్డు చేశారు. గతంలో ఈడీ కేసులోనూ శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్‌గా మారారు.

Read Also : YS Sharmila Reddy : వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ షాక్.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు!

లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో శరత్ చంద్ర అప్రూవర్‌గా మారారు. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో హాజరుపరిచిన తర్వాత శరత్ చంద్ర రెడ్డిని కవిత బెదిరించినట్లు సీబీఐ తెలిపింది. శరత్ చంద్రా రెడ్డి దక్కించుకున్న 5 జోన్లలో ఒక్కొక్క జోన్‌కి రూ. 5 కోట్ల చొప్పున రూ. 25 కోట్లు కవిత డిమాండ్ చేసినట్లు సీబీఐ పేర్కొంది.

రూ. 25 కోట్లు ఇచ్చేందుకు శరత్ చంద్ర రెడ్డి నిరాకరించడంతో కవిత బెదిరించినట్లు పేర్కొంది. కవితను రెండు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత ఈనెల 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్‌కి పంపింది ప్రత్యేక కోర్టు. సీబీఐ కేసులో జ్యూడిషియల్ రిమాండ్‌కి ఇచ్చిన నాలుగు రోజుల్లోనే శరత్ చంద్ర రెడ్డి అప్రూవర్‌గా స్టేట్మెంట్ ఇచ్చారు.

Read Also : Arvind Kejriwal : కేజ్రీవాల్‌ హెల్త్ పిటిషన్‌పై కోర్టులో విచారణ.. బెయిల్‌ కోసం షుగర్‌ పెంచుకుంటున్నారన్న ఈడీ!

ట్రెండింగ్ వార్తలు