48గంటలపాటు ఢిల్లీలో హై అలర్ట్

ఢిల్లీలో రాగల 48 గంటలపాటు హైఅలర్ట్ ప్రకటించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. అక్టోబర్-31,2019నుంచి జమ్మూకశ్మీర్ పునర్ విభజన చట్టాన్ని అమలు చేస్తున్న సమయంలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కేంద్రం ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేసింది. 

జమ్మూకశ్మీర్ పునర్ విభజనను అడ్డుకోవాలనే డిమాండ్ తో ఉగ్రవాదులు దాడులు చేయాలని ఫ్లాన్ చేస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. జమ్మూకశ్మీర్ తోపాటు ఢిల్లీలో ముఖ్యమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఢిల్లీని,పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులను తమ హిట్ లిస్టులో పెట్టారని అందిన సమాచారంతో కేంద్ర పారామిలటరీ బలగాలతోపాటు ఢిల్లీ పోలీసులను కేంద్రం అప్రమత్తం చేసింది.

ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా నివారించేందుకు వీలుగా ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాలు, భవనాల దగ్గర సాయుధ పోలీసులను మోహరించారు. అనుమానిత ప్రాంతాల్లో, వ్యక్తులను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీలో భద్రతపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ అక్టోబర్ -28,2019న హై లెవల్ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు