Magunta Raghava : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్

మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 45 ప్రకారం ఇలాంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయడం తగదని వాదన వినిపించింది.

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ లభించింది. ఢిల్లీ హైకోర్టు రాఘవకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన అమ్మమ్మ అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని రాఘవ కోరారు. దీంతో ఢిల్లీ హైకోర్టు రెండు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. అయితే రాఘవ బెయిల్ ను వ్యతిరేకిస్తూ ఈడీ వాదనలు వినిపించింది.

83 ఏళ్ల రాఘవ అమ్మమ్మ బాత్రూమ్‌లో జారపడి గాయపడ్డారని, ముక్కుకు గాయమవడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని ఈడీ చెప్పింది. ఆమె బాగోగులు చూసుకునే బంధువులు చాలా మందే ఉన్నారని, పైగా ఐసీయూలో ఉండగా రోగిని చూడడం కుదరదని ఈడీ వాదించింది.

Masab Tank Flyover : వాహనం నుంచి కిందపడిన ఆయిల్ డ్రమ్ములు.. రోడ్డు మొత్తం ఆయిల్.. భారీగా ట్రాఫిక్ జామ్

మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 45 ప్రకారం ఇలాంటి కారణాలతో బెయిల్ మంజూరు చేయడం తగదని వాదన వినిపించింది. కేసులో నిందితులందరికీ తమ బంధువులు బాత్రూంలో పడి గాయపడుతున్నారని, వారిని చూడడం కోసం బెయిల్ దరఖాస్తులు చేస్తున్నారని అదనపు సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు.

ఈడీ వాదనలు పరిగణలోకి తీసుకోకుండా రాఘవకు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ప్రస్తుతం శరత్ చంద్రారెడ్డి బెయిల్ పై ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు