నిర్భయ తల్లి నిర్ణయం: నాబిడ్డకు న్యాయం జరిగింది..ఇక అత్యాచార బాధితుల కోసం పోరాడతా

Delhi :I will continue to fight for justice to all rape victims : దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత కిరాతకంగా దారుణ అత్యాచారానికి గురైన ‘నిర్భయ’ ఘటనకు నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ..తన నిర్ణయాన్ని తెలియజేశారు. ‘‘తన కూతురు నిర్భయకు నివాళిగా తాను ఇకపై అత్యాచార బాధితులకు న్యాయం కోసం పోరాడుతానని ఆశాదేవీ ప్రతిజ్ఞ చేశారు. నేటితో నిర్భయ ఘటన జరిగి 8 ఏళ్లు. దోషులకు శిక్షను అమలు చేయడంతో తన కూతురికి న్యాయం జరిగిందని అన్నారామె.

తన కూతురికి జరిగిన అన్యాయానాకి దోషులకు మరణశిక్షతో న్యాయం జరిగింది. కానీ నాలాంటి ఎంతోమంది కూతుళ్లకు జరిగిన అన్యాయాలకు న్యాయం జరగటంలేదు. అటువంటి అన్యాయాలపై తాను పోరాడతానని తెలిపారు.తనకూతురికి న్యాయం జరిగింది కదాని తాను మౌనంగా కూర్చోనని ఆశాదేవి తెలిపారు. తన కూతురిలా అత్యాచారానికి గురైన బాధితులందరి తరఫున న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని తన దృఢనిశ్చయాన్ని తెలియజేశారు.

దేశంలో అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కలిసి పోరాడాలని ఆశాదేవి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దోషులను ఉరి తీయడంతో నిర్భయకు న్యాయం జరిగిందని..కానీ ఎంతోమంది బాధితులకు న్యాయం జరగటంలేదన్నారు. చాలా కేసుల్లో బాధితులు బాధితులుగానే ఉండిపోతున్నారనీ..వారిని న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు తనకు న్యాయవ్యవస్థపై సంతృప్తి కలుగుతుంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అత్యాచారాల హింసలకు గురై న్యాయం కోసం న్యాయస్థానాలకు వస్తున్న బాధితులకు కొంతమంది న్యాయవాదులు ద్రోహం చేస్తున్నారనీ..నేరం చేసినవారి తరపున వాదిస్తున్నారని ఇది సరైంది కాదని ఆమె అన్నారు. దోషులకు న్యాయవాదులు అండగా నిలుస్తూ కోర్టుల్లో వాదిస్తున్నారని అది ఏమాత్రం సరైందికాదని ఆశాదేవి తెలిపారు.

న్యాయశాస్త్రం చదివి ప్రతిజ్ఞ చేసేటప్పుడు న్యాయాన్ని కాపాడతామని..న్యాయం తరపున వాదిస్తామని చేసిన ప్రతిజ్ఞల గురించి కొంతమంది లాయర్లు మరచిపోయి కాసులకు కక్కుర్తి పడుతూ నేరం చేసినవారి తరపున వాదిస్తున్నారనీ..ఇది ఏమాత్రం సరైంది కాదని సూచించారు.