Delhi Road Accident: ఢిల్లీలో అర్థరాత్రి ఘోర ప్రమాదం.. రెండు వాహనాలు ఢీకొనడంతో…

ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

Delhi Road Accident

Road Accident: దేశ రాజధాని ఢిల్లీలోని అలీపూర్ రోడ్డులో బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులు కేకలు వేయడంతో పోలీసులు, స్థానికులు ఘటన స్థలికి చేరుకున్నారు. వెంటనే అంబులెన్స్ సహాయంతో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి విషంగాఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాద ఘటనలో మరణించిన వారు ఎక్కడివారు అనే విషయాన్ని తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Yamuna River : ఈ రాత్రికి ఢిల్లీ మునిగిపోతుందా? అత్యంత భయానకంగా యమునా నది ప్రవాహం

దేశరాజధాని ఢిల్లీలో వారం వ్యవధిలోనే రెండు వరుస ప్రమాదాలు చోటుకున్నాయి. ఘజియాబాద్ లోని ఢిల్లీ – మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో బస్సు, కారు ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఆరుగురు మరణించిన విషయం మరవక ముందే బుధవారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకోవటం వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోంది.