Delhi Maharashtra Report Biggest Ever Single Day Covid Spike
Delhi, Maharashtra మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 63,739 కరోనా కేసులు,398మరణాలు నమోదయ్యాయి.కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.
ఇక,ఇవాళ 45,335మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక,ఇప్పటివరకు రాష్ట్రంలో 6,38,034 యాక్టివ్ కేసులున్నాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35,14,181మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని,25,168మంది ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ లో ఉన్నారని తెలిపింది.
మరోవైపు,దేశరాజధాని ఢిల్లీలో కూడా రికార్డు స్థాయిలో గడిచిన 24గంటల్లో 19,486కరోనా కేసులు,141మరణాలు నమోదయ్యాయి.ఢి ల్లీలో పాజిటివిటీ రేటు 19.69 శాతంగా ఉంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 12,649 కోవిడ్ రోగులు డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24గంటల్లో దేశరాజధానిలో దాదాపు 99,000 మందికి కరోనా వైరస్ టెస్ట్ లు చేయబడ్డాయి.