Kailash Gehlot Resigns
Kailash Gehlot Resigns: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఇటీవల సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా అతీశీ కొనసాగుతున్నారు. తాజాగా.. ఆప్ ప్రభుత్వంలో రావాణాశాఖ మంత్రిగా పనిచేస్తున్న కైలాష్ గెహ్లాట్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు లేఖను పంపారు. తన రాజీనామాకు గల కారణాలను లేఖలో పేర్కొన్నారు.
Also Read: నేను మీకు భయపడను.. ఎలాన్ మస్క్ కు బ్రెజిల్ ప్రథమ మహిళ వార్నింగ్.. వీడియో వైరల్
కేజ్రీవాల్ కు రాసిన లేఖలో కైలాష్ గెహ్లాట్ తన రాజీనామాకు గల కారణాలను ప్రస్తావించారు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుందని నేను మీకు చెప్పాలనుకున్నాను. రాజకీయ ఆశయం ప్రజల పట్ల నిబద్ధతను అధిగమించింది. అనేక వాగ్ధానాలు నెరవేరలేదు. ఉదారహరణకు.. మనం యమునా నదిని స్వచ్ఛమైన నదిగా చేస్తామని వాగ్దానం చేశాము. కానీ, మనం అలా చేయలేకపోయాము. ఇప్పుడు యమునా నది గతంలో కంటే కలుషితమైంది. మరో బాధాకరమైన విషయం ఏమిటంటే.. ప్రజల హక్కుల కోసం పోరాడకుండా కేవలం మన రాజకీయ ఎజెండా కోసమే పోరాడుతున్నాం. దీంతో ఢిల్లీ ప్రజలు కనీస సేవలు కూడా అందక ఇబ్బందులు పడుతున్నారు.
ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంతో పోరాడుతూనే ఎక్కువ సమయం గడిపితే ఢిల్లీకి ఏమీ జరగదని ఇప్పుడు స్పష్టమైందని అన్నారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో నా రాజకీయ ప్రయాణం ప్రారంభించాను. అలాగే కొనసాగాలనుకుంటున్నాను. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేయడం తప్ప నాకు మరో మార్గం లేదు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని కైలాష్ గెహ్లాట్ లేఖలో పేర్కొన్నారు.
Kailash Gahlot resigns from AAP; claims ‘political ambitions have overtaken party’s commitment to people’
Read @ANI Story | https://t.co/d8iP6htXtv #KailashGehlot #AAP #Resignation #ArvindKejriwal pic.twitter.com/JYHJADRQS8
— ANI Digital (@ani_digital) November 17, 2024