Brij Bhushan in charge sheet: బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపుల కేసు చార్జ్‌షీట్‌లో కీలక ఆధారాలు లభ్యం

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల కేసు చార్జ్‌షీట్‌లో ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలు సమర్పించారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ఆధారాలను పోలీసులు చార్జ్ షీటులో కోర్టుకు సమర్పించారు....

బ్రిజ్ భూషణ్ కేసులో కీలక ఆధారాలు లభ్యం

Brij Bhushan in charge sheet: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల కేసు చార్జ్‌షీట్‌లో ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలు సమర్పించారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ఆధారాలను పోలీసులు చార్జ్ షీటులో కోర్టుకు సమర్పించారు. 1500 పేజీల ఛార్జిషీట్‌లో ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల్లో ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలు, వీడియో రుజువులున్నాయి. (charge sheet in Harassment case) ఈ కేసులో కోర్టు విచారణ జూన్ 22వతేదీన జరగనుంది.

Nepal President Paudel hospitalised: నేపాల్ అధ్యక్షుడు రాంచంద్ర పౌడెల్‌కు మళ్లీ గుండెపోటు..ఆసుపత్రిలో చేరిక

దర్యాప్తులో భాగంగా పోలీసులు నమోదు చేసిన 200కు పైగా సాక్షుల వాంగ్మూలాలు, బాధిత రెజ్లర్లు చేసిన ఆరోపణలకు సంబంధించిన వాంగ్మూలాలున్నాయి. ఛార్జ్ షీట్‌లో ఆరుగురు రెజ్లర్ల సామూహిక వాంగ్మూలాలు, 70-80 మంది సాక్షులు అందించిన వాంగ్మూలాలు, ఫొటోలు, వీడియోలు, కాల్ వివరాల రికార్డులతో సహా వివిధ రకాల సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. ఆరుగురు మహిళా రెజ్లర్లు తమ ఫిర్యాదుల్లో పలు సంఘటనలను పేర్కొన్నందున వారు ఒక్కో ఫిర్యాదును విడివిడిగా చార్జ్ షీట్‌లో పేర్కొన్నామని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Assam flood worsens: కురుస్తున్న భారీవర్షాలు..వరదలతో అసోం అతలాకుతలం

సాక్ష్యాల్లో పతకాల వేడుకల ఫొటోలు, గ్రూప్ ఫోటోలు,ఇతర ఈవెంట్‌లు ఉన్నాయి.ప్రత్యక్ష సాక్షులు, సహ క్రీడాకారులు, రిఫరీల ప్రకటనల సాక్ష్యాలున్నాయి. మైనర్ ఫిర్యాదుదారు మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నందున, బ్రిజ్ భూషణ్‌పై పోక్సో చట్టం కేసులో పోలీసులు రద్దు చేసిన నివేదికను కూడా దాఖలు చేశారు.

Putin confirms first nuclear weapons: ఫస్ట్ అణ్వాయుధాలను బెలారస్‌కు తరలించాం..వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు

విచారణలో భాగంగా సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించిన సంఘటనలకు సంబంధించి వివరాలను కోరుతూ ఢిల్లీ పోలీసులు ఐదు దేశాల రెజ్లింగ్ సమాఖ్యలకు లేఖలు రాశారు. అయితే వారి సమాధానం రాగానే చార్జిషీట్‌లో ఆ వివరాలను కూడా పొందుపరుస్తామని పోలీసువర్గాలు తెలిపాయి.టోర్నీల ఫోటోలు, వీడియోలు, రెజ్లర్లు తమ మ్యాచ్‌ల సమయంలో బస చేసిన ప్రదేశాల సీసీటీవీ ఫుటేజీలను కోరుతూ ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు.