వైరల్ వీడియో : స్టెప్పులతో ఇరగదీసిన మహిళా పోలీసులు

ఢిల్లీ: పోలీస్ డ్యూటీ అంటేనే కత్తి మీద సాము లాంటిది. విధుల్లో నిత్యం బిజీగా ఉంటారు. లా అండ్ ఆర్డర్ సంరక్షణలో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. క్రిమినల్స్ ను ఫేస్ చేస్తుంటారు.

  • Publish Date - April 2, 2019 / 10:37 AM IST

ఢిల్లీ: పోలీస్ డ్యూటీ అంటేనే కత్తి మీద సాము లాంటిది. విధుల్లో నిత్యం బిజీగా ఉంటారు. లా అండ్ ఆర్డర్ సంరక్షణలో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. క్రిమినల్స్ ను ఫేస్ చేస్తుంటారు.

ఢిల్లీ: పోలీస్ డ్యూటీ అంటేనే కత్తి మీద సాము లాంటిది. విధుల్లో నిత్యం బిజీగా ఉంటారు. లా అండ్ ఆర్డర్ సంరక్షణలో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. క్రిమినల్స్ ను ఫేస్ చేస్తుంటారు. చాలా టెన్షన్స్ ఉంటాయి. మహిళా పోలీసుల గురించి చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఖాకీలు కాసేపు రిలాక్స్ అయ్యారు. తమలోని మరో టాలెంట్ ని ప్రదర్శించారు. ఢిల్లీ మహిళా పోలీసులు స్టేజీపై స్టెప్పులతో ఇరగదీశారు. హర్యాన్వీ సాంగ్ కు ఉల్లాసంగా, ఉత్సాహంగా చిందులేశారు. 
Read Also : పారిపోలేదు : నేను ఇంట్లోనే ఉన్నానని మోహన్ బాబు క్లారిటీ

ఢిల్లీలో సౌత్ వెస్ట్ డిస్ట్రిక్ పోలీసుల ఆధ్వర్యంలో సునో సహేలీ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మహిళా పోలీసులు స్టేజీపై స్టెప్పులు వేశారు. సహచరుల జోష్ చూసి ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఆగలేకపోయారు. ఆమె కూడా వారితో జతకట్టి స్టెప్పులు వేశారు. సరదగా డ్యాన్స్ చేస్తూ సహచరుల్లో జోష్ నింపిన మహిళా పోలీసుల డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది.

Read Also : బస్సులో రూ.24లక్షలు : మహిళా మంత్రి అనుచరుడి నుంచి డబ్బు సీజ్