Delhi Omicron Threat : ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం : సీఎం కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.

Delhi Omicron Threat : దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం (డిసెంబర్ 13) సీఎం కేజ్రీవాల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఢిల్లీ కీ యోగశాల అనే కార్యక్రమాన్ని కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ.. అవసరమైతే కోవిడ్ ఆంక్షలు కూడా విధిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఒమిక్రాన్ కేసుల తీవ్రత అదుపులోనే ఉందని, ఆంక్షలు విధించాల్సిన అవసరం లేకపోవచ్చునని ఆయన చెప్పారు. అలాగే ఢిల్లీలో స్కూళ్లు తెరవడంపై కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు.

ఢిల్లీలో పాఠశాలలను తిరిగి తెరుస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు కేజ్రీవాల్ త్వరలోనే పాఠశాలలను పున: ప్రారంభించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని స్కూళ్లకు శీతాకాల సెలవులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సెలవులు ముగిసిన వెంటనే స్కూళ్లు తెరవడంపై ఒక నిర్ణయానికి వస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ కీ యోగశాల (Dilli Ki Yogshala) ప్రారంభించిన కేజ్రీవాల్.. 2022 జనవరి నుంచి అందుబాటులోకి రానుంది. ప్రారంభంలో మొదటగా 25మంది గ్రూపులకు మాత్రమే అవకాశం లభించనుంది.

ఈ మొబైల్ నంబర్ 9013585858 Missed Call ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగా టీచర్ ద్వారా ఉచితంగా యోగా సర్వీసులను పొందవచ్చు. శనివారం ఢిల్లీలో ఒమిక్రాన్ రెండో కేసు నమోదైనట్టు ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి పూర్తి వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ అతడికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అతడికి పరీక్షలు నిర్వహించగా టెస్టు పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే అతడికి నిజంగా ఒమిక్రాన్ సోకిందా? లేదా అనేది పూర్తి నిర్ధారించేందుకు శాంపిల్స్ జినోమ్ సీక్వెన్స్ రిపోర్టు కోసం ల్యాబ్ కు పంపారు. ఒమిక్రాన్ వైరస్ సోకిన వ్యక్తి సౌతాఫ్రికా కూడా వెళ్లి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

Read Also : WhatsApp Privacy Update : వాట్సాప్‌లో న్యూ అప్‌డేట్.. ఈ కొత్త ప్రైవసీతో వారికి చెక్ పెట్టొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు