Delhi Coronavirus Cases : ఢిల్లీలో కరోనా కంట్రోల్ లోకి..కొత్తగా 124 కేసులు

దేశ రాజధానిలో ఢిల్లీలో ఆదివారం 124 కొత్త కోవిడ్ కేసులు,ఏడు మరణాలు నమోదయ్యాయి.

Delhi Coronavirus Cases దేశ రాజధానిలో ఢిల్లీలో ఆదివారం 124 కొత్త కోవిడ్ కేసులు,ఏడు మరణాలు నమోదయ్యాయి. అయితే ఫిబ్రవరి-16నుంచి ఢిల్లీలో నమోదైన కోవిడ్ కేసుల్లో ఇదే అత్యల్పం. ఇక,వరుసగా రెండో రోజు మరణాలు 10 లోపు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 72,670కోవిడ్ టెస్ట్ లు నిర్వహించినట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తంగా 14.32లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయని,24,914మంది మరణించారని ఢిల్లీ ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. ప్రస్తుతం 2,091 యాక్టివ్ కేసులున్నాయని..ఇందులో 600మంది హోమ్ ఐసొలేషన్ లో ఉన్నట్లు తెలిపింది. పాజిటివిటీ రేటు 0.17శాతానికి పడిపోయిందని ప్రకటించింది.

మరోవైపు, కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్-19న లాక్ డౌన్ విధించిన ఢిల్లీ ప్రభుత్వం..దశలవారీగా ఆంక్షలు ఎత్తివేస్తోంది. సోమవారం నుంచి ఢిల్లీలో గోల్ఫ్ క్లబ్ లు, యోగా సెంటర్లు, పబ్లిక్ పార్కులు,బార్లు,గార్డెన్లు సోమవారం నుంచి తిరిగి తెరిచేందుకు కేజ్రీవాల్ సర్కార్ అనుమతించింది. మధ్యాహ్నాం 12గంటల నుంచి రాత్రి 10గంటల వరకు 50శాతం సిబ్బందితో బార్లు తెలిరిచేందుకు అనుమతిస్తున్నట్లు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ(DDMA)ఆదివారం ఓ ఆర్డర్ లో పేర్కొంది. కఠినంగా కోవిడ్ భద్రతా నిబంధనలు అమలు చేసే విషయంలో రెస్టారెంట్లు,బార్లు ఓనర్లదే బాధ్యత అని తెలిపింది. ఇక,తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విద్యాసంస్థలు,సినిమా థియేటర్లు,జిమ్ లు,స్పా సెంటర్లు,అన్నిరకాల రాజకీయ కార్యక్రమాలు,సామాజిక,సాంస్కృతిక,మత పరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు