Temperature
ఢిల్లీలో అక్టోబరు నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని ప్రధాన వాతావరణ కేంద్రం సఫ్దర్‌జంగ్‌లో రికార్డు చేసిన ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం.. 1951 నుంచి గత ఏడాది వరకు అక్టోబరులో ఎన్నడూ నమోదు కాని అధిక ఉష్ణోగ్రతలు గత నెల రికార్డయ్యాయి.
ఈ అక్టోబరులో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.1 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 1951 అక్టోబరులో గరిష్ఠ ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, ఈ ఏడాది అక్టోబరు వరకు అంతగా ఎన్నడూ రికార్డు కాలేదు.
ఇక 1941లో అక్టోబరులో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.8 డిగ్రీల సెల్సియస్, 1907లో 35.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే… 1915, 1951 సంవత్సరాల్లో సగటు ఉష్ణోగ్రత 22.3 డిగ్రీలుగా రికార్డయింది. 1941లో 22.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
కాగా, దాదాపు 74 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అక్టోబరులో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.1 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడం పట్ల వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పారు.
టీటీడీపీపై దృష్టి సారించిన చంద్రబాబు.. టీటీడీపీ అధ్యక్షుడిగా బాబూమోహన్?