Covid
Covid Cases In Delhi : ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కోద్ది రోజులుగా దేశ రాజధానిలో ఒమిక్రాన్ తో పాటుగా కోవిడ్ కేసుల్లో కూడా పెరుగుదల కనిపిస్తోంది. సోమవారం ఢిల్లీలో 331 కొత్త కోవిడ్ కేసులు,ఒక మరణం నమోదయ్యాయి. కోవిడ్ పాజిటివిటీ రేటు 0.68శాతంగా ఉన్నట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. నమోదయ్యాయి. అయితే,దాదాపు 7 నెలల్లో ఢిల్లీలో ఒక్క రోజులో నమోదైన కోవిడ్ కేసుల్లో ఇదే అత్యధికం.
ఇక,తాజా గణాంకాలతో ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 14,43.683కి చేరగా,మరణాల సంఖ్య 25,106కి చేరింది. 14.17లక్షల మందికిపైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు.
మరోవైపు,దేశంలోనే అత్యధికంగా ఢిల్లీలో ఇప్పటివరకు 142 కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” కేసులు నమోదయ్యాయి.పెరుగుతున్న కోవిడ్,ఒమిక్రాన్ కేసుల దృష్ట్యా..వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా కేజ్రీవాల్ ప్రభుత్వం సోమవారం నుంచి ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఢిల్లీలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది.
ALSO READ MoC Accounts : మదర్ థెరిసా మిషనరీల అకౌంట్లు ఫ్రీజ్..మమత ఆరోపణలకు కేంద్రం కౌంటర్