ఢిల్లీలో విధ్వేశ శక్తులకు కళ్లెం వేసేది ఎవరు ? : సంయమనం పాటించాలి

  • Publish Date - February 26, 2020 / 02:35 PM IST

దేశ రాజధాని ఢిల్లీ ఎప్పుడూ లేనంతగా అట్టుడుకుపోతోంది. కొన్ని నెలలుగా శాంతియుతంగా జరుగుతున్న CAA, NRCలపై జరుగుతున్న పోరాటంలో విధ్వేషం విరుచుకపడింది. రెండు రోజులుగా ఇరువర్గాల మధ్య జరుగుతున్న దాడుల్లో 20 మందికిపైగా చనిపోయారు. ఇందులో అమాయక పౌరులు, ఓ కానిస్టేబుల్‌తో సహా యంగ్ ఐబీలో పనిచేస్తున్న ఆఫీసర్ ఉన్నారు. అనేక మంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వీరిలో సగం మందికి బుల్లెట్ గాయాలున్నట్లు సమాచారం. చివరకు జర్నలిస్టులను కూడా వదలలేదు. లూటీలు, విధ్వంస కాడ సంగతి చెప్పనవసరం లేదు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. మౌజ్ పూర్, ఖర్జీఖాన్, భాజాన్ పూర్, చాంద్ బాగ్ తదితర ప్రాంతాల్లో జరిగిన దాడులతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే..శాంతి భద్రతలను కాపాడడంలో కేంద్రం వైఫల్యం చెందిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయనే సంగతి తెలిసిందే. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు..జామియా, జేఎన్‌యూ, అలీ ఘడ్ యూనివర్సిటీల్లో జరిగిన విధ్వంస కాండా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. మొన్ననే…అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారతదేశ పర్యటనకు వచ్చారు. ఆయన పర్యటన కోసం పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఢిల్లీలో ఉండగానే..విధ్వంసకాండ చోటు చేసుకోవడం గమనార్హం. ఇక్కడ బీజేపీ పార్టీకి చెందిన నేతలు చేసిన రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు..ప్రజలకు రక్షణ ఎక్కడుంటుందనే విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఢిల్లీ బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా..డీసీపీ ప్రకాష్ సూర్యను పక్కన ఉండగానే..మూడు రోజుల్లో నిరసన శిబిరాలు తుడిచిపెట్టివేస్తామని హుంకరించిన మరుసటి రోజే..కర్రలు, రాళ్లు రివాల్వర్లలతో అల్లరి మూకలు పెట్రేగిపోయాయి. పక్కా స్కిప్ర్టు ప్రకారమే జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

దాడులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలో సీఏఏ నిరసన కారులపై జరిగిన దాడులను, సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. శాంతియుతంగా సాగుతున్న నిరసనలపై హింసాత్మక దాడులకు తెగబడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే..హింసకు పాల్పడింది ఎవరు ? లూటీలు, విధ్వంసకాండ చేసింది ఎవరు ? అనేది తేలాల్సి ఉంది. ఢిల్లీలో శాంతిసామరస్యాలను కాపాడాల్సినవసరం ఉంది. మతతత్వ శక్తుల విధ్వేష ప్రచారానికి రెచ్చిపోకుండా..ప్రజలు సంయమనం పాటించాలని పలువురు సూచిస్తున్నారు. 

Read More : అసనగిరి కొండల్లో ‘అల్లూరి సీతారామరాజు’ గుహలు