Delhi surgeon: కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా.. కరోనాతో డాక్టర్ మృతి

పాజిబిలిటీ ఉన్న ట్రీట్ మెంట్ అంతా చేశాం. ఇది చాలా పెద్ద నష్టం. చాలా మంది డాక్టర్లు, హెల్త్ కేర్ స్టాఫ్ జబ్బు బారిన పడుతున్నారు...

Delhi surgeon: కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా.. కరోనాతో డాక్టర్ మృతి

Delhi Surgeon

Updated On : May 9, 2021 / 9:59 AM IST

Delhi surgeon: ఢిల్లీ సరోజ్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పైకి తీసుకెళ్లేముందు డా. అనిల్ కుమార్ రావత్ ఇలా అన్నారు. ‘నేను దీని నుంచి బయటకొచ్చేస్తాను. వ్యాక్సిన్ వేయించుకున్నా కదా’ అని అన్నారు. శనివారం ప్రాణాలతో పోరాడుతూ 58ఏళ్ల వయస్సులో మరణించారు.

1996 నుంచి హాస్పిటల్ కు సేవలందిస్తున్న రావత్ ను.. జెంటిల్మెన్ అని, జోవియల్ కొలీగ్ అని తోటి డాక్టర్లు పిలిచేవారు. మార్చి స్టార్టింగ్ లోనే కొవీషీల్డ్ వ్యాక్సిన్ సెకండ్ షాట్ కూడా వేసుకున్నారని డా. పీకే భరద్వాజ్, హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ చెప్పారు. వాళ్లిద్దరికీ 1994 నుంచి పరిచయం ఉంది.

‘అతను నాకు పెద్ద కొడుకు లాంటి వాడు. ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజిలో ఎమ్మెస్ సర్జరీ పూర్తి చేశారు. అతని కెరీర్ కూడా నా యూనిట్ ఆర్బీ జైన్ హాస్పిటల్ లోనే 1994లో మొదలుపెట్టాడు. ఆ తర్వాత చనిపోయేంతవరకూ నాతోనే ఉన్నాడు’ అని భరద్వాజ్ అన్నారు.

కొవిడ్ వచ్చిన 10-12 రోజుల వరకూ డా. రావత్ హోం ఐసోలేషన్ లోనే ఉన్నాడు. ఆక్సిజన్ లెవల్ పడిపోతుందని తెలిసి వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశాం. అతని టీం వీలైనంత వరకూ పోరాడినప్పటికీ కాపాడలేకపోయామని అంటున్నారు. కుదిరితే ఊపిరితిత్తుల మార్పిడి చేద్దామని కూడా అనుకున్నారట.

అవసరమైనంత మేర అన్ని చేశాం. పాజిబిలిటీ ఉన్న ట్రీట్ మెంట్ అంతా చేశాం. ఇది చాలా పెద్ద నష్టం. చాలా మంది డాక్టర్లు, హెల్త్ కేర్ స్టాఫ్ జబ్బు బారిన పడుతున్నారు. వ్యాక్సినేషన్ అయిన తర్వాత కూడా ఇదే సమస్య. కొందరు మాత్రం కొద్దిపాటి లక్షణాలతో రికవరీ అవుతున్నారు. పూర్తి వ్యాక్సినేషన్ వేయించుకున్నాక ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ ఇతనే.

అదే హాస్పిటల్ లో అతని భార్య గైనకాలజీ డిపార్ట్మెంట్ లో డాక్టర్ గా చేస్తున్నారు.

డా. ఆకాశ్ జైన్.. సర్జన్ అదే హాస్పిటల్ లో.. రావత్ 16ఏళ్లుగా తెలుసు. శనివారం ఉదయం వరకూ అతనితోనే ఉన్నా. రెండ్రోజుల క్రితమే వెంటిలేటర్ పై ఉంచాం. న్యూమోనియా ఎక్కువవడంతో శ్వాస వ్యవస్థ దెబ్బతింది. అతను నాకు తమ్ముడిలాంటి వాడు. ఈ నష్టాన్ని వివరించలేను. తుది శ్వాస వరకూ అతనితోనే ఉన్నా. అతను చాలా పోరాడాడు.

వెంటిలేటర్ మీద వెళ్లేముందు దీని నుంచి బయటపడతా. నేను వ్యాక్సిన్ వేయించుకున్నా అని ధీమాగా చెప్పాడు.