Kaleshwaram Report: బ్రేకింగ్.. కాళేశ్వరం రిపోర్టుపై హైకోర్టుకు కేసీఆర్, హరీశ్ రావు
కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని కేసీఆర్, హరీశ్ రావు అన్నారు.

KCR Harish Rao
Kaleshwaram Report: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై హైకోర్టుకు వెళ్లారు. జస్టిస్ ఘోష్ నివేదికను సవాల్ చేస్తూ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని కేసీఆర్, హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ నివేదిక ఆ రకంగా ఉందని ఆరోపించారు.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నిర్మాణ లోపాలు, విధానపరమైన లోపాలు, పరిపాలనా నిర్ణయాలలో ఉల్లంఘనలు సహా సమగ్రంగా అధ్యయనం చేయడానికి నియమించిన కాళేశ్వరం కమిటీని నియమించిన విషయం తెలిసిందే.
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ కొన్ని రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ సమర్పించింది. ఆ తర్వాత సీఎం రిపోర్ట్‌పై ప్రాథమిక చర్చ జరిపారు. Kaleshwaram Report
కాళేశ్వరం ప్రాజెక్ట్ బరాజ్ నిర్మాణంలో వైఫల్యాలు స్పష్టంగా ఉన్నాయని పీసీ ఘోష్ కమిషన్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ప్రభుత్వంలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు తప్పిదాలు కనిపించాయని తెలిపింది.
నియమాలను పక్కనబెట్టి పనులను వ్యక్తుల ఇష్టానుసారం చేసినట్టు కమిషన్ భావించింది. ఇంజినీరింగ్, నిర్మాణ స్థాయిలోని నిర్ణయాలు టాప్ అధికారుల, రాజకీయ బాసుల ఒత్తిడితో తీసుకున్నాయని పేర్కొంది. డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం దశ నుంచే ఉల్లంఘనలు కనిపించాయని స్పష్టం చేసింది.