Delhi
Corona Unlock Process : దేశ రాజధానిలో కరోనా మెల్లిమెల్లిగా కంట్రోల్ లోకి వస్తోంది. వైరస్ కట్టడికి అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడంతో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో దశలవారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్ నిర్ణయించారు. ప్రస్తుతం మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగనున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గుముఖం పడితే..మే 31వ తేదీ నుంచి అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు గతంలో సీఎం కేజ్రీవాల్ చెప్పిన సంగతి తెలిసిందే. ఢిల్లీ విపత్తు నిర్వాహణ అథార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లాక్ డౌన్ క్రమంగా ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కరోనా సెకండ్ వేవ్ పై నియంత్రణ సాధించామని అయితే ఈ వైరస్ పై పోరాటం ముగిసినట్టు కాదన్నారు. ప్రస్తుతానికి వైరస్ అదుపులోనే ఉందని, గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 1.5 శాతం వద్ద ఉందన్నారు. ప్రతివారం నిపుణులు, ప్రజల అభిప్రాయాల ఆధారంగా అన్‌లాక్ ప్రక్రియ కొనసాగించనున్నట్టు ఆయన వెల్లడించారు.
భారతదేశంలో కరోనా విజృంభించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పలు రాష్ట్రాల్లో పాజివిటి కేసులు అధికమయ్యాయి. అందులో ఢిల్లీ రాష్ట్రం కూడా ఒకటి. వైరస్ ఉధృతంగా ఉండడం..ఆక్సిజన్ అందక నానా అవస్థలు పడ్డారు. తొలుత వారంతాపు లాక్ డౌన్ ప్రకటించారు. వైరస్ కేసుల సంఖ్యలో ఏ మాత్రం మార్పు లేకపోవడంతో ఏప్రిల్ 19 నుంచి పూర్తిస్థాయి లాక్ డౌన్ ప్రకటించారు. అనంతరం దీనిని పొడిగిస్తూ..వచ్చారు. ప్రస్తుతం మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.
Read More : Sarkaru Vari Paata: అవుట్ అండ్ అవుట్ యాసలో మహేష్ మాటాల తూటాలు?!