మా వాటా మాకివ్వాల్సిందే..! కొనసాగుతున్న ఢిల్లీ మంత్రి అతిశీ నిరాహార దీక్ష

ఢిల్లీ నీటి సంక్షోభంపై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఆప్ ట్యాంకర్ మాఫియాను ప్రోత్సహిస్తుందని, నీటి సమస్యను పరిష్కరించకుండా ..

Atishi Hunger Strike On Delhi Water Crisis : దేశ రాజధాని ఢిల్లీకి తాగునీటిని విడుదల చేసే బ్యారేజీ గేట్లను హరియాణా ప్రభుత్వం మూసివేసిందని, వాటా ప్రకారం ఢిల్లీకి దక్కాల్సిన నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ జల వనరుల శాఖ మంత్రి అతిశీ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. నీటికోసం ఢిల్లీలో ఆమె చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరింది. హర్యానా ప్రభుత్వం నీటిని విడుదల చేసే వరకు, ఢిల్లీ ప్రజలు నీటిని పొందేవరకు తన సత్యాగ్రహం కొనసాగుతుందని అతిశీ స్పష్టం చేశారు.

Also Read : లక్ష్యం కీలక పదవులు, శాఖలు కాదు.. టీడీపీ ప్రభుత్వం అసలు టార్గెట్ ఇదే

ఢిల్లీకి ప్రతిరోజు 1005 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉంటుంది. హర్యానా నుంచి ప్రతిరోజు 613 మిలియన్ గ్యాలన్ల నీటి వాటా రావాల్సి ఉంది. అయితే, గడిచిన రెండు వారాల నుంచి హర్యానా ప్రభుత్వం ఢిల్లీకి 513 మిలియన్ గ్యాలన్ల నీటిని మాత్రమే ఇస్తుందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఢిల్లీకి హర్యానా నుంచి ప్రతిరోజు 100 మిలియన్ గ్యాలన్ల నీరు తక్కువగా వస్తుండటంతో 28 లక్షల మంది ప్రజలపై ప్రభావం పడుతుందని అతిశీ పేర్కొంది. ఢిల్లీ ప్రజల కష్టాలు చూడలేక ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు ఆమె తెలిపింది.

Also Read : Elon Musk : మస్క్ మామ మళ్లీ తండ్రి అయ్యాడు.. న్యూరాలింక్ ఉద్యోగినితో మూడో బిడ్డ.. మొత్తం 11మంది సంతానం..!

ఢిల్లీ నీటి సంక్షోభంపై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఆప్ ట్యాంకర్ మాఫియాను ప్రోత్సహిస్తుందని, నీటి సమస్యను పరిష్కరించకుండా నిరసనలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఏడుగురు ఎంపీలను గెలిపించి మోదీని ప్రధాన మంత్రిని చేస్తే.. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం నుండి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను నిలిపివేయడం ద్వారా ఢిల్లీ ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆప్ పరిపాలనలో వైఫల్యం చెందిందని ఆప్ ప్రభుత్వ తీరుపట్ల ఢిల్లీ ఎల్జీ అసంతృప్తి వ్యక్తం చేసింది.