నిండు గర్బిణీ..7 కిలో మీటర్లు..డెలివరీ చేసిన డెంటల్ హాస్పిటల్ వైద్యులు

  • Publish Date - April 19, 2020 / 12:09 PM IST

కరోనా వైరస్ తో ఎంతో మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసింది. చిన్న పిల్లల నుంచి మొదలుకుని పండు ముసలి వారి వరకు ఈ దిక్కుమాలిన వైరస్ తో ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎక్కడికైనా వెళ్లడానికి రవాణా సౌకర్యం కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.

ఇక గర్బిణీల విషయం చెప్పనవసరం లేదు. మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు ఆసుపత్రులకు చేరుకోవాలంటే గగనమౌతోంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాగే ఓ ఘటన జరిగింది. పురిటినొప్పులతో బాధ పడుతూ..దాదాపు ఏడు కిలో మీటర్లు ప్రయాణించింది. నార్త్ బెంగళూరులో ఓ కార్మిక కుటుంబం నివాసం ఉంటోంది. భార్య పురిటినొప్పులతో బాధ పడుతుండడంతో ఆ వ్యక్తి ఏమి చేయలేకపోయాడు.

ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఏడు కిలో మీటర్లు ప్రయాణం చేశారు. ఏ ఒక్క ఆసుపత్రి తెరిచి లేదు. చివరకు ఓ డెంటల్ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. నొప్పులు ఎక్కువ కావడంతో అక్కడున్న సిబ్బంది ఆమెకు డెలివరీ చేశారు. కానీ..పుట్టిన పసికందులో చలనం లేదు. ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతోంది. అకస్మాత్తుగా శిశువు కదలికలు వచ్చాయి. చివరకు తల్లీ, బిడ్డలను బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. లాక్ డౌన్ కారణంగా ఆసుపత్రులు మూసి ఉండడంతో తప్పని పరిస్థితుల్లో తామే డెలివరీ చేయాల్సి వచ్చిందని డెంటల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. 

Also Read | హైదరాబాద్‌లో స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్