వారు దేశ ద్రోహులు కారు..జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

  • Publish Date - February 15, 2020 / 10:57 PM IST

విమర్శల నోరు నొక్కి..ప్రజల మనస్సులో భయాందోళనలు కలిగిస్తే..వ్యక్తిగత స్వేచ్చ, రాజ్యాంగ విలువలను హరించేదాక వెళుతుందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరుల జాబితా (NRC)లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గుజరాత్ హైకోర్టు ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమానికి చంద్రచూడ్ హాజరై ప్రసంగించారు.

విబేధించిన వారిని జాతి, ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా ముద్ర వేస్తే రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని విఘాతంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విబేధించే వారిని, విమర్శకులను అణిచివేసేందుకు ప్రభుత్వ యంత్రాగాన్ని ఉపయోగిస్తే..చట్టబద్ధమైన పాలనకు తూట్లు పొడిచినట్లేనన్నారు. ఈ చర్యలు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాలకు అన్ని రకాల అభివృద్ధి మూలాలను ధ్వంసం చేస్తాయని హెచ్చరించారు.

హిందువుల ఇండియా, ముస్లింల ఇండియా అన్న భావనలను తిరస్కరించారని, వారు మన భారతదేశాన్ని గణతంత్ర దేశంగా తీర్చిదిద్దారని రాజ్యంగ నిర్మాతలు వెల్లడించారని గుర్తు చేశారు. ఏదైనా విషయంపై విమర్శించాల్సిన సమయంలో..ధైర్యంగా తమ అభిప్రాయాలు వెల్లడించాలని సూచించారు. న్యాయవాదికి ధైర్యసాహసాలు ముఖ్యమన్నారు జస్టిస్ చంద్రచూడ్. 
Read More : మణిరత్నం సినిమాలో ఐశ్వర్యది నెగటివ్ రోల్!

ట్రెండింగ్ వార్తలు