బ్రేకింగ్ : మహారాష్ట్ర సీఎం గా దేవేంద్రఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం 

  • Publish Date - November 23, 2019 / 03:03 AM IST

మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.  కాంగ్రెస్, శివసేన లకు బీజేపీ షాకిచ్చింది. ఎన్సీపీ తో కలిసి బీజేపీ  శనివారం, నవంబర్ 23వతేదీ  ఉదయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణ స్వీకారం చేయగా… డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు.  రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ వారిచే ప్రమాణం చేయించారు.

అయితే శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ శుక్రవారం రాత్రే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తెర వెనుక వ్యూహాలు రచించిన బీజేపీ  అజిత్‌ పవార్‌తో రహస్య మంతనాలు చేసింది. ఈ నేపథ్యంలో తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు గవర్నర్‌ను కోరారు. రాత్రికి రాత్రే అనేక రాజకీయ పరిణామాలు చేసుకున్న నేపథ్యంలో ఎన్సీపీ మద్దతుతో ఫడ్నవిస్‌ సీఎం ప్రమాణంగా చేశారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశామని గవర్నర్‌ తెలిపారు. సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న శివసేనకు ఎన్సీపీ ఊహించని షాక్‌ ఇచ్చింది. సీఎంగా ఉద్దవ్‌ ఠాక్రేను ప్రకటించిన మరుసటి రోజే ఊహించని పరిణామం జరిగింది. కాగా పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో రెండు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ భేటీ అయిన విషయం తెలిసిందే.

Also Read : సుస్థిర పాలన కోసమే చేతులు కలిపాం : డిప్యూటీ సీఎం అజిత్ పవార్