Petrol Rate : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ఎంతంటే?

పెట్రోల్ డీజిల్ దరల పెరుగుతుండటంతో సామాన్యులపై భారం పడుతోంది. ఇప్పటికే రూ.100 దాటిన పెట్రోల్ ధర.. రూ.110 వైపు పరుగులు పెడుతోంది.

Petrol Rate

Petrol Rate : పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. నిలకడనేది లేకుండా పెరిగిపోతున్న ధరలను చూసి వినియోగదారులు భయపడిపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో రూ.87గా ఉన్నలీటర్ పెట్రోల్ ధర.. ప్రస్తుతం రూ.100 దాటింది. కొన్ని చోట్ల రూ.110కి చేరువైంది. డీజిల్ ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. చాలా నగరాల్లో లీటర్ డీజిల్ ధర రూ.90కి పైనే ఉంది. ఇక మంగళవారం కూడా ఫ్యూయల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై రూ.20 పైసలు పెరగ్గా, డీజిల్ పై రూ.25 పైసలు పెరిగింది. ఈ పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.39కు చేరుకుంది.

Read More : Posani KrishnaMurali : పవన్‌పై మరోసారి పోసాని కృష్ణమురళి ఫైర్- Live

దేశ రాజధానిలో ఒక లీటర్ డీజిల్ ను రూ.89.57కు విక్రయిస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ పై 19 పైసలు పెరిగి ధర రూ.101.46కి చేరింది. డీజిల్ పై 27పైసలు పెరిగి ₹ 97.7కి చేరింది. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.107.47, డీజిల్ ధర లీటరుకు రూ.97.21గా ఉన్నాయి. గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్‌ ధరలు పెరగడం ఇది తొలిసారి కాగా.. డీజిల్‌ ధరలు నాలుగోసారి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు మూడేళ్ల గరిష్ఠానికి చేరాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగి పోతున్నాయి. దీంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి.

Read More : Monkey Riding Goat: మేకపై పిల్ల కోతి సవారీ.. 130లక్షల మంది మనసు గెలిచిన వీడియో