Pfizer Pill : కరోనాను అడ్డుకునే ఫైజ‌ర్ టాబ్లెట్‌..త్వరలోనే మార్కెట్ లోకి..ఇది ఎలా ప‌ని చేస్తుంది?

కరోనాను అడ్డుకునే ఫైజ‌ర్ టాబ్లెట్‌..ఎలా ప‌ని చేస్తుంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అందరు ఆ ఫైజర్ టాబ్లెట్ గురించి ఎదురు చూస్తున్నారు.

Pfizer Pill : కరోనాను అడ్డుకునే ఫైజ‌ర్ టాబ్లెట్‌..త్వరలోనే మార్కెట్ లోకి..ఇది ఎలా ప‌ని చేస్తుంది?

Pfizer Pill

Pfizer Pill : కరోనాను ఖతం చేయటానికి ఎంతోమంది సైంటిస్టులు అతి త్వరగా టీకా వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మహమ్మారిని నియంత్రించారు. లక్షలాదిమందిని కోల్పోయినా ప్రపంచ వ్యాప్తంగా మరణాలను ఆపగలిగారు. ఇప్పటి వరకు కరోనాను అడ్డుకోవటానికి టీకా వ్యాక్సిన్లు మాత్రమే వచ్చాయి.

కానీ…అస‌లు కొవిడ్ సోకకుండా అడ్డుకునే ఓ యాంటీవైర‌ల్ టాబ్లెట్‌ ‘ఫైజ‌ర్’ వస్తుందని జనాలు ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఇది ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎలా పనిచేస్తుంది? అనే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఫైజర్ టాబ్లెట్ కోసం జనాలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కొవిడ్ సోక‌కుండా అడ్డుకునే ఓ యాంటీవైర‌ల్ టాబ్లెట్‌ను ఫైజ‌ర్( Pfizer Pill ) సంస్థ అభివృద్ధి చేసింది. ఇది చివ‌రి ద‌శ క్లినిక‌ల్ ప్ర‌యోగాల ద‌శ‌లో ఉంది. ఈ టాబ్లెట్ స‌మ‌ర్థంగా ప‌ని చేస్తుంద‌నితేలితే..ఇక కరోనా పని ఖతం అయినట్లే. అలా ఈ ఫైజర్ టాబ్లెట్ కోసం ఎదురు చూసే జనాలకు ఓ శుభవార్త అనే చెప్పాలి? ఎందుకంటే ఈ ఫైజర్ టాబ్లెట్ 2021 చివ‌రిలోపు మార్కెట్‌లోకి రానుంది.

Read more : Pfizer Vaccine-Delta : డెల్టా వేరియంట్‌‌ను అడ్డుకోవడంలో ఫైజర్ వ్యాక్సిన్ సమర్థత తక్కువ!

ఏంటీ ఫైజ‌ర్ టాబ్లెట్‌?

ఏంటీ ఫైజ‌ర్ టాబ్లెట్‌? అంటే..ఇది యాంటీ వైర‌ల్ డ్ర‌గ్‌. ఇప్పటివరకు మనం కరోనా సోకుండా మాత్రమే టీకా వేయించుకుంటున్నాం. కోవాగ్జిన్ అని కోవీషీల్డ్ వంటివి. కానీ ఫైజర్ టాబ్లెట్ అలాకాదు కరోనా వైరస్ ఓ వ్య‌క్తిలోకి వెళ్లిన త‌ర్వాత ఆ వ్య‌క్తికి క‌రోనా సోక‌కుండా ఈ డ్ర‌గ్ అడ్డుక‌ట్ట వేయ‌గ‌ల‌ద‌ని ఫైజ‌ర్ సంస్థ చెబుతోంది. పీఎఫ్‌-07321332 అనే ఈ డ్ర‌గ్‌ను గ‌తేడాది మార్చి నుంచి అభివృద్ధి చేస్తోంది. ప్ర‌యోగాల్లో భాగంగా దీనిని హెచ్ఐవీ రోగుల కోసం వాడే రిటోన‌విర్‌తో క‌లిపి ఇస్తున్నారు. ల్యాబ్ ప‌రీక్ష‌ల్లో ఈ యాంటీవైర‌ల్ డ్ర‌గ్ వైర‌స్‌ను నియంత్రిస్తున్న‌ట్లు తేలింది. కొవిడ్ ప్రారంభ ద‌శ‌లో ఉన్న వారిపై ఇది స‌మర్థంగా ప‌ని చేస్తుందని ఫైజ‌ర్ చెబుతోంది.

క్లినిక‌ల్ ద‌శ ప్ర‌యోగాల్లో భాగంగా ఈ యాంటీవైర‌ల్ డ్ర‌గ్ పీఎఫ్‌-07321332ను రిటోన‌విర్‌తో క‌లిపి వాడుతూ దాని భ‌ద్ర‌త‌, సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షించి చూశారు. మొత్తం 2660 మంది ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తుల‌పైనా కరోనా బారిన పడివారిపైన కూడా ఈ ప్ర‌యోగాలు నిర్వ‌హిస్తున్నారు.

ఎలా ప‌ని చేస్తుంది ఫైజర్ టాబ్లెట్?

ప్ర‌యోగాల్లో భాగంగా..ఈ క్లినికల్ ప్రయోగాల్లో పాల్గొన్నవారికి పీఎఫ్‌-07321332తోపాటు రిటోన‌విర్‌ను ఇస్తారు. వీళ్ల‌లో మూడో వంతు మందికి పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ని ఓ ఔష‌ధాన్ని ఇస్తారు. మిగ‌తా వాళ్ల‌కు ఈ పీఎఫ్‌-07321332 డ్ర‌గ్‌ను రోజూ రెండు పూట‌లా ఐదు నుంచి ప‌ది రోజుల పాటు ఇస్తారు. తొలి ద‌శ ప్ర‌యోగాల్లో ఈ డ్ర‌గ్ పూర్తి సుర‌క్షిత‌మ‌ని తేలింది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ ఏడాది చివ‌రిలోపు ఈ డ్ర‌గ్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాల‌ని ఫైజ‌ర్ భావిస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచే ఫైజ‌ర్ తొలి ద‌శ ప్ర‌యోగాలు ప్రారంభించిన‌ట్లు సీఎన్బీసీ రిపోర్ట్ వెల్ల‌డించింది.

ఇలాంటి యాంటీవైర‌ల్ డ్ర‌గ్స్‌ గురించి ఫైజ‌ర్‌తోపాటు ఇత‌ర కంపెనీలు కూడా ప‌ని చేస్తున్నాయి. ఇన్‌ఫ్లుయెంజాకు టామిఫ్లూ ఎలా ప‌ని చేస్తోందో కొవిడ్‌కు ఈ యాంటీవైర‌ల్స్ అలా ప‌ని చేసేలా ఈ కంపెనీలు పలు ప్ర‌యోగాలు చేస్తున్నాయి. మెర్క్‌&కంపెనీ, రిడ్జ్‌బ్యాక్ బ‌యోథెర‌ప్యూటిక్స్ ఇప్ప‌టికే మోల్నుపిర‌విర్ పేరుతో ఓ డ్ర‌గ్ త‌యారు చేశాయి. ఇక రోచె అండ్ అటియా ఫార్మాసూటిక‌ల్స్ కూడా ఏటీ-527 పేరుతో మ‌రో డ్ర‌గ్ అభివృద్ధి చేశాయి.

మరి ఈ ఫైజర్ టాబ్లెట్ అన్ని విధాలుగా ఓకే అయి మార్కెట్ లోకి వచ్చి అది కొవిడ్ ప్రారంభ ద‌శ‌లో ఉన్న వారిపై ఇది స‌మర్థంగా ప‌ని చేస్తే ఇక కరోనా ఖతం అయినట్లేనని భావిస్తున్నారు నిపుణులు. ఎంతో ఆసక్తిగా..ఆశతో ఎదురు చూస్తే ఈ ఫైజర్ టాబ్లెట్ అనుకున్న రేంజ్ లో ఫలితాలు చూపిస్తే ఇక కరోనా నుంచి ప్రపంచం హాయిగా ఊపిరి తీసుకునే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.