President
Opposition Parties రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ కి లేఖ రాశాయి. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. బీఎస్పీ, ఆర్ఎల్పీ, ఎస్ఏడీ, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ, సీపీఎంతో పాటు ఎన్సీపీకి సంబంధించిన నేతలు రాష్ట్రపతికి రాసిన లేఖపై సంతకాలు చేసినట్లు ఆమె తెలిపారు.
కాగా, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న క్రమంలో పలువురు రైతులు మరణించడం చాలా దురదృష్టకరమని శిరోమణి అకాలీ దళ్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ అన్నారు. అయితే కేంద్రం ఇంకా వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చించడానికి సిద్ధంగా లేకపోవడం దారుణమని ఆమె విమర్శించారు.