Omar abdulla surprice congress stand on CBI over raids on sisodia
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొనకపోవడం నిరాశ కలిగించిందని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి నిర్వహించిన భారత్ జోడో యాత్ర మొన్న శ్రీనగర్ లో ముగిసిన విషయం తెలిసిందే. కశ్మీర్ లో ఈ పాదయాత్రలో రాహుల్ తో కలిసి ఒమర్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… భారత్ జోడో యాత్రకు దూరంగా ఉన్న పార్టీల నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు. ఎందుకంటే భారత్ జోడో యాత్ర ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చేందుకు కాదని అన్నారు.
తాము బీజేపీకి వ్యతిరేకమని, దేశంలోని అన్ని మతాలను ఒకేలా చూస్తామని చెప్పిన పార్టీలు భారత్ జోడో యాత్రలో పాల్గొనకపోవడం ఆశ్చర్యకరమని, ఎందుకంటే ఆ పాదయాత్ర ఐక్యతను చాటిచెప్పడానికే చేపట్టారని అన్నారు. రాజకీయాలు కేవలం పొత్తుల కోసం కాదని చెప్పారు. అందుకే తాను ఈ యాత్రలో పాల్గొన్నానని తెలిపారు.
Kartik Aryan : షారుఖ్ పఠాన్ కలెక్షన్స్ కోసం రిలీజ్ ని వాయిదా వేసుకున్న మరో స్టార్ హీరో..