10 Discount On Chicken If You Bring A Steel Box
10 discount on chicken if you bring a steel box : చికెన్, మటన్, చేపలు, గుడ్లు కావాలంటే షాపుకు వట్టి చేతులు ఊపుకుంటూ వెళ్లిపోతాం. షాపు వాళ్లు ఇచ్చిన ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఇస్తే తెచ్చేసుకుంటాం. ఓ చికెన్ షాపు యజమాని మాత్రం వట్టి చేతులతో కాదు కూడా స్టీల్ బాక్సు తెచ్చుకోండి అని చెబుతున్నాడు కష్టమర్లకు. స్టీల్ బాక్స్ తెచ్చుకుంటూ రూ.10లు డిస్కౌంట్ కూడా ఇస్తానంటున్నాడు సుధాకర్ చికెన్ మార్కెట్ యజమాని. దీనికోసం ఓ బ్యానర్ కూడా ఏర్పాటు చేసి పెట్టాడు.
ఈ ప్రకటన బోర్డు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ ప్రకటన బోర్డుని షేర్ చేస్తూ.. ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలనీ అందరూ కోరుతున్నారు. ‘ఫ్రెండ్ ఇది చాలా మంచి ఆలోచన అంటున్నారు నెటిజన్లు. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నామని తెలిపారు.కాగా..ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి..మూగజీవాలను ఎంత హాని కలుగుతుందో తెలిసి కూడా ప్లాస్టిక్ వాడకాన్ని మానలేకపోతున్నాం. దీంతో రోజు రోజుకీ ప్లాస్టిక్ వాడకం పెరిపోయింది. ప్లాస్టిక్ లేకుండా అడుగు కూడా వేయలేకపోతున్నాం. వాడి పారేసిన ప్లాస్టిక్ చెత్త పర్యావరణానికి చేటు చేస్తోంది. ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన నాలాలు మసుకుపోతున్నాయి.
భూగర్భజలాల కాలుష్యం మొదలైనవాటితోపాటు విచక్షణారహితంగా ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు కలుగుతున్నాయి. ఇక మూగజీవాలు.. ఈ ప్లాస్టిక్ వ్యర్ధాల్లోని పదార్ధాలను తిని ఎంతగా ఇబ్బందులు పడుతున్నాయో తరచుగా వింటూనే ఉన్నాం.
మన దేశంలో సగటున ప్రతి వ్యక్తి ఒక పాలిథీన్ సంచిని చెత్తబుట్ట పాలు చేసినా రోజుకి వందకోట్ల పైమాటే అవుతున్నాయట. అవన్నీ భూమిలో, ఎడారిలో, నీళ్ళలో, కొండల్లో, అడవుల్లో, గుట్టల్లో ఎక్కడపడితే అక్కడ పాతుకుపోతున్నాయి. ఆ వ్యర్థాలు కొండలా పేరుకుపోతున్నాయి.
మనం చేసిన తప్పులు మనల్నే కబళించేస్తున్నాయి. నెమ్మది నెమ్మదిగా మానవ జాతిని కబళిస్తోంది. ఒక ప్లాస్టిక్ సంచి భూమిలో కలవాలంటే కొన్ని వందల ఏళ్ళు పడుతుందనేది శాస్త్రీయంగా నిరూపించబడింది. దీంతో కొన్ని వ్యాపార సంస్థలు ప్లాస్టిక్ ను బ్యాన్ చేశాయి. చిరువ్యాపారులు కూడా చాలామంది ప్లాస్టిక్ కవర్లను బ్యాన్ చేశాయి. అటువంటిదే ఈ చికెన్ షాపు యజమాని మంచి నిర్ణయం. ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్లాస్టిక్ కవర్ నిషేధానికి తన వంతుగా చికెన్ షాపు యజమాని ప్రయత్నం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అని చెప్పాల్సిందే.