Disha Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు..సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో కీలక అంశాలు..

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో.. సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ సమర్పించిన నివేదికల కీలక అంశాలు పేర్కొంది.

Disha Encounter Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసుసిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికలో కీలక అంశాలు పేర్కొంది. మూకదాడి ఎంత అన్యాయమో తక్షణ న్యాయం కూడా అంతే అన్యాయం అని అభిప్రాయపడింది. నేరానికి చట్టప్రకారమే శిక్ష వేయాలి తప్ప అదేదో ఆషామాషీగా జరగకూడదని ఇష్టానుసారంగా జరగకూడదని పేర్కొంది. దిశ ఎన్ కౌంటర్ కేసులో పోలీసులు నిందుతులు తమమీద కాల్పులు జరిపారని అందుకే తాము ఆత్మరక్షణ కోసం ఎన్ కౌంటర్ చేశామని చెప్పటం అనే విషయం పూర్తిగా అవాస్తం అని నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమని జస్టిస్‌ వీఎస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చింది.

Also read : Disa‌ Encounter: దిశా ఎన్కౌంటర్‌లో సుప్రీం సంచలన తీర్పు: పోలీసులపై హత్యా నేరం నమోదు

ఇది కూడా మూకదాడి లాంటిదేనని అభిప్రాయపడింది. 41 రౌండ్లు ఒకేసారి కాల్పులు జరపడం అనేది అసాధారణమని..పోలీసులపై నిందితులు కాల్పులు జరపలేదని కమిషన్ పేర్కొంది. పోలీసుల నుంచి నిందుతులు పిస్టల్స్ లాక్కున్నారు అనేది పోలీసులు అల్లిన కట్టుకధేనని తేల్చి చెప్పింది. అలాగే దీనికి సంబంధించి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కూడా నిర్లక్ష్యం జరిగింది అని పోలీసులపై నిందితులు కాల్పులు జరపలేదని కానీ పోలీసులు మాత్రం ఉద్ధేశపూర్వకంగానే నిందితులపై కాల్పులు జరిపి బూటకపు ఎన్ కౌంటర్ చేశారని కమిషన్ తెలిపింది.

Also read : Supreme Court Disha Case : ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసు..విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు

నిందితులు ఎదురు కాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదంది. ఈమేరకు సుప్రీంకోర్టు సమర్పించిన నివేదికలో జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ పేర్కొంది. అలాగే నిందితుల్లో ముగ్గురు మైనర్లన్న విషయాన్ని పోలీసులు దాచిపెట్టారని పేర్కొంది. ఈ క్రమంలోనే పోలీసులు వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మాదర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు ఎస్.అర్వింద్ గౌడ్, డి.జానకీరామ్, ఆర్.బాలు రాథోడ్, డి.శ్రీకాంత్‌పై విచారణ జరపాలని కమిషన్‌ సూచించింది. ఈ పది మంది పోలీసులపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని కమిషన్ నివేదికలో పేర్కొంది.

 

ట్రెండింగ్ వార్తలు