Diwali Festive Rush : దీపావళి పండగ వేళ రైల్వే స్టేషన్లలో భారీగా రద్దీ.. రైళ్లను ఎక్కలేకపోయిన ప్రయాణికులు

న్యూఢిల్లీలోని స్టేషన్లలో రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. శనివారం సూరత్‌లో బీహార్‌కు వెళ్లే ప్రత్యేక రైలు వైపు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రావడంతో తొక్కిసలాట జరిగింది.

passengers rush at Railway stations

Railway Stations – Diwali Festive Rush : దీపావళి పండుగ వేళ ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిపోయాయి. లక్షలాది మంది కుటుంబాలతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవడానికి స్వంతూళ్లకు వెళ్తున్నారు. సరిపడా రైళ్లను ఏర్పాటు చేయకుండా, ప్రయాణికుల రద్దీని నివారించకపోవడం పట్ల భారతీయ రైల్వే విమర్శలు ఎదుర్కొంది. రద్దీగా ఉండే రైళ్లు, కంపార్ట్‌మెంట్ల వెలుపల పొడవైన క్యూలు, చాలా మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రతక్షమైన వీడియోలో కనిపిస్తున్నాయి. రైల్వే స్టేషన్ లో విపరీతమైన రద్దీ కారణంగా ఓ వ్యక్తి గుజరాత్‌లోని వడోదర రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కలేక పండుగలకు సొంతూరుకు వెళ్లలేకపోయాడు.

తాను ధృవీకరించబడిన టిక్కెట్‌ను కొనుగోలు చేసినట్లు పేర్కొంటూ ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. “ఇండియన్ రైల్వే చెత్త నిర్వహణ. సొంతూరిలో నేను దీపావళి పండుగను జరుపుకోకుండా చేసినందుకు ధన్యవాదాలు. మీరు ధృవీకరించబడిన 3వ ఏసీ టిక్కెట్‌ను కలిగి ఉన్నా కూడా వెళ్లలేకపోయాను. పోలీసుల నుండి ఎటువంటి సహాయం లేదు. నాలాంటి చాలా మంది వ్యక్తులు రైలు ఎక్కలేకపోయారు.” అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

US Military Plane : కుప్పకూలిన యూఎస్ సైనిక విమానం

కార్మికుల బృందం తనను రైలు నుండి బయటకు తోసేసి, తలుపులు మూసివేశారని ఎవరినీ రైలులోకి ప్రవేశించనివ్వలేదని చెప్పారు. పోలీసులు తనకు సహాయం చేయవద్దని స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. ఆ పరిస్థితిని చూసి నవ్వడం ప్రారంభించినట్లు తెలిపారు. వడోదర డివిజనల్ రైల్వే మేనేజర్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ సంఘటనపై రైల్వే పోలీసులను పరిశీలించాలని కోరారు. దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే స్టేషన్లలో కూడా భారీగా జనసందోహం కనిపించింది.

న్యూఢిల్లీలోని స్టేషన్లలో రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. శనివారం సూరత్‌లో బీహార్‌కు వెళ్లే ప్రత్యేక రైలు వైపు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పలువురు స్పృహతప్పి పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. రైల్వే స్టేషన్‌లో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు రద్దీ ఏర్పడటంతో కొంతమంది భయాందోళనకు గురై మూర్చ పోయారని పోలీసులు తెలిపారు.