ఈడీ ఆఫీసుకి ఐశ్వర్య

కాంగ్రెస్ సీనియర్ లీడర్,కర్నాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కుమార్తె ఐశర్య(23)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. మనీ లాండరింగ్ కేసులో డీకే శివకుమార్ ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమార్తె  ఐశర్యను విచారణ నిమిత్తం ఈడీ ఢిల్లీకి పిలిచింది. ఐశ్వర్య పేరిట పలు ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి ఐశ్వర్య ఢిల్లీ వెళ్ళారు. 78 కోట్ల రూపాయల లావాదేవీలతో పాటు ఐశ్వర్య బ్యాంకు ఖాతాకు రూ.20 కోట్ల రూపాయలు జమ కావడం ప్రస్తుతం విచారణలో కీలకం కానుంది. ఈ నెల 13తో డి.కె.శివకుమార్‌ కస్టడీ ముగిసేందుకు ఒకరోజు ముందు కుమార్తెను విచారణలకు హాజరు కావాలని కోరడంతో ఆయనను మరింత కాలం కస్టడీ కొనసాగించే అవకాశం ఉంది. లేదా జుడీషియల్‌ కస్టడీకి పంపే అవకాశం ఉంది. 

ట్రెండింగ్ వార్తలు