DMK deputy general secretary quits politics
DMK: తమిళనాడు అధికార పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సుబ్బలక్ష్మీ జగదీషన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. మంగళవారం పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు.
యూపీఏ మొదటి ప్రభుత్వంలో ఆమె కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా పని చేశారు. 14వ లోక్సభలో తిరుచెంగోడ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే తమిళనాడు ప్రభుత్వంలో సైతం 1977-1980 మధ్య టెక్స్టైల్ మంత్రిగా విధులు నిర్వర్తించారు. అలాగే 1989-1991 మద్య సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా సుబ్బలక్ష్మీ జగదీషన్ పని చేశారు.