Cheetah Plays With Tortoise: చిరుత, తాబేలు స్నేహం.. నెట్టింట్లో వీడియో వైరల్.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
చిరుత, తాబేలు స్నేహం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా.. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Cheetah Plays With Tortoise
Cheetah Plays With Tortoise: ఒక వ్యక్తికి జీవితంలో స్నేహితులు అత్యంత కీలకమైన మద్దతుగా ఉంటారు. స్నేహితులు ఉంటే ఒంటరితనం దరిచేరదు. ఆనందకరమైన జీవితాన్ని సాగించవచ్చు. మనుషుల్లోనే కాదు.. జంతువులు స్నేహంగా కలిసిమెలిసి ఉంటాయి. కానీ కొన్ని జంతువులు స్నేహం చేయడం మనం అరుదుగా చూస్తుంటాం. ఉదాహరణకు.. చిరుత, తాబేలు. ఇవి స్నేహంగా ఉండటం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా చిరుత, తాబేలు స్నేహంగా కలిసిఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Viral Video: ప్రియుడితో స్కూటీపై షికారుకెళ్లిన భార్య.. చేజ్ చేసి చితకబాదిన భర్త.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో పార్క్‌లో చిరుత తన తలను తాబేలు పెంకుపై రుద్దుతూ దానితో ఆడుకుంటున్నట్లు ఉంది. తాబేలు కూడా గడ్డిపై నిశ్చలంగా పడుకుని తన సహచరుడితో సరదాగా ఆడుకుంటుంది. గతవారం ఇన్‌స్టాగ్రామ్‌లో కార్సన్ స్ప్రింగ్స్ వైల్డ్‌లైఫ్ షేర్ చేసిన వీడియో క్యాప్షన్‌లో.. “మంగళవారం మరియు పెన్జీ మంచి స్నేహితులు. కార్సన్ స్ప్రింగ్స్‌లో వారిని చూడండి.. అంటూ పేర్కొన్నాడు.
View this post on Instagram
వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 1.1 మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షించింది. 56,000 కంటే ఎక్కువ మంది లైక్ లు చేశారు. కొంతమంది నెటిజన్లు ఈ అరుదైన దృశ్యంపై స్పందించారు..”నేను అదంతా మనిషి నమ్మశక్యం కానిదిగా చూశాను” అని నెటిజన్ పేర్కొన్నాడు. మరో నెటిజన్.. “ఉత్తమ జాతి సహచరులు” అని చెప్పారు.