Viral Video: ప్రియుడితో స్కూటీపై షికారుకెళ్లిన భార్య.. చేజ్ చేసి చితకబాదిన భర్త.. వీడియో వైరల్

తన ప్రియుడితో కలిసి స్కూటీపై షికారుకెళ్తున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అక్కడే అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు భార్యను చితకబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: ప్రియుడితో స్కూటీపై షికారుకెళ్లిన భార్య.. చేజ్ చేసి చితకబాదిన భర్త.. వీడియో వైరల్

Wife was riding electric scooter with her boyfriend

Viral Video: తన ప్రియుడితో కలిసి స్కూటీపై షికారుకెళ్తున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అక్కడే అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు భార్యను చితకబాదాడు. ఈ ఘటన ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోలో.. తన లవర్ స్కూటీపై వెళ్తున్న భార్యను గమనించిన భర్త.. వెనుకాలే మరోస్కూటీపై తన కూతుర్ని ఎక్కించుకొని ఛేజ్ చేసిమరీ భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

Heroine Tamannaah’s Bouncers Attack : న్యూస్ కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్ర‌తినిధుల‌పై త‌మ‌న్నా బౌన్స‌ర్ల దాడి

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ జంటకు పదేళ్ల క్రితం పెళ్లయింది. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే భార్య ఓ వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు. ఈ విషయంపై గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరుగుతుంది. భార్యను ఎలాగైనా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అక్రమ సంబంధం గుట్టురట్టు చేయాలని భర్త అనుకున్నాడు. తాజాగా మరోసారి సెప్టెంబర్ 11న వారి మధ్య ఘర్షణ తలెత్తడంతో మహిళల కుమార్తెనుసైతం ఇంటిలోనే వదిలి వెళ్లిపోయింది. భార్యను వెతికేందుకు కుమార్తెతో కలిసి స్కూటీపై భర్త వెళ్లాడు.

అలాకొద్దిదూరం వెళ్లిన తరువాత.. మరో వ్యక్తి స్కూటీపై భార్య వెళ్తుండాన్ని భర్త గుర్తించాడు. దీంతో వేగంగా వారిని ఛేజ్ చేసి బండిని ఆపే ప్రయత్నం చేశాడు. అయినా భార్య, తన ప్రియుడు పట్టించుకోకుండా స్కూటీని వేగంగా పోనిచ్చారు. అలాకొద్దిసేపు ఛేజింగ్ జరిగిన తరువాత ఎట్టకేలకు భార్యఉన్న బండిని ఆపి రోడ్డుపైనే భార్య, ఆమె ప్రియుడును చెప్పుతో చితకబాదాడు. దీంతో వారు అక్కడినుండి పరుగులు లంకించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.