Big Boss 17
Big Boss 17 : హిందీ బిగ్ బాస్ 17 విజేతగా స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ నిలిచారు. జనవరి 28న జరిగిన గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ సల్మాన్ ఖాన్ విజేతను ప్రకటించారు. బిగ్ బాస్‌కి రావడానికి ముందు మునావర్ జైలుకి వెళ్లొచ్చారు. జైలు జీవితం నుండి బిగ్ బాస్ గెలుపు వరకు మునావర్ ప్రయాణం తెలుసుకుందాం.
Naa Saami Ranga Success Meet : ‘నా సామిరంగ’ సక్సెస్ మీట్ ఫొటోలు..
సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ 17 గ్రాండ్ ఫినాలే జనవరి 28న జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హాజరయ్యారు. ఈసారి 21 మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లో పోటీ పడ్డారు. వీరిలో అంకితా లోఖండే, మునావర్ ఫరూఖీ, మన్నారా చోప్రా, అభిషేక్ కుమార్, అరుణ్ మాశెట్టి టాప్ 5లో నిలిచారు. ఎంతో ఉత్కంఠగా జరిగిన పోటీలో చివరగా అభిషేక్ కుమార్, మునావర్ ఫరూఖీ టాప్ 2 నిలిచారు. ఫైనల్ విజేతగా మునావర్ ఫరూఖీ పేరును సల్మాన్ అనౌన్స్ చేశారు. విన్నర్‌గా మునావర్ ఫరూఖీ రూ.50 లక్షలతో పాటు లగ్జరీ కారును కూడా గెలుచుకున్నారు.
చిరంజీవి వల్లే ఫస్ట్ కారు కొన్నా అంటున్న ఆ విలన్ ఎవరంటే?
కాగా గుజరాత్‌కి చెందిన మునావర్ ఫరూఖీ గతంలో జైలు జీవితం గడిపి వచ్చారు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసారన్న ఆరోపణలపై బీజేపీ ఎంపీ కుమారుడు ఏకలవ్య సింగ్ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల రోజులపాటు శిక్ష అనుభవించి మునావర్ ఫరూఖీ బయటకు వచ్చారు. కాగా మునావర్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హోస్ట్ చేసిన ‘లాక్ అప్’ రియాలిటీ షో 2022 విజేతగా నిలిచారు. బిగ్ బాస్ హౌస్‌లో తనదైన ఆటతో వినోదాన్ని పంచుతూ 17వ సీజన్ విజేతగా నిలిచారు మునావర్ ఫరూఖీ. అతని గెలుపు కోసం సపోర్ట్ చేసిన వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.